టీఆర్ఎస్ లో విలీనం చేయండి: ఎర్రబెల్లి | 10 TDP MLAs want to Merge in TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ లో విలీనం చేయండి: ఎర్రబెల్లి

Feb 12 2016 10:57 AM | Updated on Sep 3 2017 5:31 PM

టీఆర్ఎస్ లో విలీనం చేయండి: ఎర్రబెల్లి

టీఆర్ఎస్ లో విలీనం చేయండి: ఎర్రబెల్లి

తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని టీడీపీ నుంచి 'గులాబీ' దళంలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు.

హైదరాబాద్: తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని టీడీపీ నుంచి 'గులాబీ' దళంలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం స్పీకర్ కు లేఖ రాశారు. టీఆర్ఎస్ లో విలీనం కావడానికి 10 మంది ఎమ్మెల్యేలు అంగీరించారని వెల్లడించారు. నిన్న టీఆర్ఎస్ కార్యాలయంలో తామందరం సమావేశమయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలోనూ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరారు. స్పీకర్ కు రాసిన లేఖలో తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement