బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య | young man suicide in lepakshi | Sakshi
Sakshi News home page

బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య

Jul 21 2015 11:32 AM | Updated on Nov 6 2018 7:56 PM

బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.

లేపాక్షి (అనంతపురం): బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షిలో సోమవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు... హిందూపురం బీసీ బాలుర హాస్టల్‌లో పనిచేసే చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలసి లేపాక్షిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు సాయి (18) తనకు బైక్ కొనివ్వలేదని రెండురోజుల నుంచి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నాడు.

సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన సాయిని భోజనం చేయలేదేమని తల్లిదండ్రుల అడగ్గా తింటానని  చెప్పి తన గదిలోకి వెళ్లాడు. 11 గంటలైనా బయటకు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. అతన్ని అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement