శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల | TTD seva tickets will avail for december and january on friday | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Nov 3 2016 8:53 PM | Updated on Sep 4 2017 7:05 PM

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు, జనవరిలో నిర్వహించనున్న వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో www.ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా టికెట్లను భక్తులు ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు.

డయల్ యువర్ టీటీడీ ఈవో

తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877- 2263261 నెంబరుకు డయల్ చేసి ద్వారా నేరుగా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement