వెనుకబడిన కులాల జాబితాను ప్రభుత్వానికి నివేదించాలని బీసీ కమిషన్‌ను రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని బీసీ కమిషన్‌ను రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంబీసీ కులాల సామా జిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించాలని పేర్కొంది. ఏ కులాలను ఎంబీసీలుగా గుర్తించాలో తేలితే కాని ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేమని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతినిధిబృందం బీసీ కమిషన్‌కు వినతిపత్రాన్ని సమర్పించింది.