టీడీపీ కార్యకర్తల దుశ్చర్య | tdp-followers-attack-ysrcp rs leader | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తల దుశ్చర్య

Jan 27 2016 11:47 AM | Updated on Aug 10 2018 9:42 PM

కృష్ణా జిల్లా నందివాడ మండలం పాతరామాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నత్తా శేషగిరిరావు ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు.

నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ మండలం పాతరామాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నత్తా శేషగిరిరావు ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు శేషగిరిరావు కుటుంబసభ్యులు నిద్రిస్తున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
 
ఇరుగుపొరుగు వారు అప్రమత్తం చేయటంతో శేషగిరిరావుతోపాటు ఆయన భార్య నిర్మల, తల్లి నాగేశ్వరమ్మ, కుమారుడు మధుబాబు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రాంబాబు, వీఆర్వో భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement