తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు | special pujas at tiruchanuru padmavathi temple | Sakshi
Sakshi News home page

తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు

Published Fri, Aug 28 2015 9:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

special pujas at tiruchanuru padmavathi temple

తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. ఆస్తాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వ్రతాలు జరగనున్నాయి.

అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి అర్చకులు వ్రతాలు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement