మూడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ | Sharmila paramarsha yatra in adilabad distirict | Sakshi
Sakshi News home page

మూడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ

Oct 5 2015 1:08 PM | Updated on Aug 17 2018 2:53 PM

వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఆయన సోదరి షర్మిల ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది.

హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఆయన సోదరి షర్మిల ఆదిలాబాద్ జిల్లాలో  చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సోమవారం షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. తొలుత బజార్ హత్నూరులోని కాసుబక్కయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అక్కడి నుంచి నిర్మల్ మీదుగా దిలావర్ పూర్ చేరుకుని కామాటిబొల్ల ముత్యం కుటుంబాన్ని కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్వరం మండలం హవర్గాకు వెళ్లి పర్స భోజన్న కుటుంబాన్ని పరామర్శించారు.


నేటితో ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర ముగుస్తుంది. అనంతరం నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్రను చేపడతారు. జిల్లాలోని బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement