కబాలి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలనుకొని థియేటర్లకు వెళ్లిన వారికి హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
బ్లాక్లో కబాలి టికెట్లు: నలుగురు అరెస్ట్
Jul 22 2016 12:00 PM | Updated on Mar 28 2018 11:26 AM
శంషాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన కబాలి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలనుకొనేవారికి థియేటర్ల లో హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గణేష్ థియేటర్‌లో హౌస్‌ఫుల్ బోర్డు వేసి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. కొనుగోలు చేయాలని ప్రయత్నించిన అభిమానులకు టికెట్ల రేట్లు చూసి దిమ్మతిరిగిపోతోంది. దీంతో అభిమానులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుచి సినిమా టికెట్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement