ఆటో, బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత | One killed in road accident | Sakshi
Sakshi News home page

ఆటో, బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత

Feb 11 2016 1:20 PM | Updated on Apr 3 2019 7:53 PM

వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సమీపంలోని వై.కోట బైపాస్ వద్ద ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లె వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement