కాల్మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నందునే అసెంబ్లీలో చర్చకు చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీ: కాల్మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నందునే అసెంబ్లీలో చర్చకు చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయన్నారు.
కాల్ మనీపై చర్చ జరగకుండా టీడీపీ అంబేడ్కర్ ను అడ్డుపెట్టుకుంటుందని మకపాటి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబేడ్కర్ అంటే గౌరవం ఉందని, దళితుల అభ్యున్నతి కోసం పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కాల్మనీపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను సమాజం నుండి వెలివేయాలని మేకపాటి రాజమోహన్ రావు డిమాండ్ చేశారు.