దారుణహత్య, తల.. మొండెం విడివిడిగా లభ్యం | man murdered in rangareddy district | Sakshi
Sakshi News home page

దారుణహత్య, తల.. మొండెం విడివిడిగా లభ్యం

Dec 7 2015 9:22 AM | Updated on Aug 29 2018 8:36 PM

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మంచాల మండలం రంగాపురం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

మంచాల: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మంచాల మండలం రంగాపురం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలో వ్యక్తి మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు వ్యక్తి మొండెం మాత్రమే కనిపించింది. దీంతో  పరిసరాల్లో గాలింపు చేపట్టి వ్యక్తి తలను స్వాధీనం చేసుకున్నారు.
 
మృతుడు జిల్లాలోని యాచారం మండలం నర్సక్క మేడిపల్లికి చెందిన కిరణ్ గా గుర్తించారు. కిరణ్ ను హత్య చేసి తల, మొండెం వేరు చేశారా లేదా  ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేప్టటారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement