నల్లగొండ జిల్లాలో నాలుగు రోజులుగా సూది సైకో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నాలుగు రోజులుగా సూది సైకో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న ఓ బాలికపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేశాడు. వివరాలు..స్థానిక సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదివే నందిని నడిచి వెళ్తుండగా బైక్‌పై వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆమె చేతిపై సూదితో పొడిచి వెళ్లిపోయాడు. దీంతో బాలిక గట్టిక కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.