‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా! | If anyone talks about Amma, his tongue will be cut off: AIADMK MP on | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా!

Jul 21 2015 1:42 AM | Updated on Sep 3 2017 5:51 AM

‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా!

‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా!

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక కోస్తానని హెచ్చరించి అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం దుమారం రేపారు.

రాశిపురం: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక కోస్తానని హెచ్చరించి అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం దుమారం రేపారు. రాశిపురంలో ఆదివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ, జయ ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తూ, ఆమె ఇక విశ్రాంతి తీసుకోవాలంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధినేత కరుణానిధిపై  మండిపడ్డారు. ‘అమ్మ(జయ) ఆరోగ్యం గురించి ఎవరు ప్రశ్నించినా, వారి నాలుక కోస్తా’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement