జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం మహిళా స్వీపర్లపై దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగం మహిళా స్వీపర్లపై దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం మాదన్నపేట పరిధిలోని కుర్మగూడలో చోటు చేసుకుంది. కవిత, మంజు అనే స్వీపర్లపై ముగ్గురు యువకులు దాడి చేసి దుర్భాషలాడారు. జీహెచ్‌ఎంసీ సూపర్ వైజర్ నాగరాజు సహాయంతో మహిళా స్వీపర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


