నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు | chain snatching in vanasthalipuram | Sakshi
Sakshi News home page

నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

Mar 14 2016 11:57 AM | Updated on Sep 3 2017 7:44 PM

నగరంలో చైన్‌స్నాచర్లు మరోఎసారి రెచ్చిపోయారు.

హైదరాబాద్‌: నగరంలో చైన్‌స్నాచర్లు మరోఎసారి రెచ్చిపోయారు.  సోమవారం ఉదయం ఒక్క వనస్థలిపురం పరిధిలోనే మూడు చోట్ల ముగ్గురు మహిళల నుంచి 12.5 తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఎన్జీఓస్ కాలనీలో అలివేలు మంగమ్మ అనే మహిళ మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసు, కుసుమకుమారి అనే మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు గొలుసు, హుడాసాయినగర్ కాలనీలో కృష్ణవేణి అనే మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసులను బైక్‌లపై వచ్చిన దుండగులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement