అడ్రస్ అడిగి గొలుసు లాక్కొని వెళ్లారు | chain snatching in hyderabad | Sakshi
Sakshi News home page

అడ్రస్ అడిగి గొలుసు లాక్కొని వెళ్లారు

Apr 8 2016 1:58 PM | Updated on Sep 3 2017 9:29 PM

అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఓ మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కొని దుండగుడు పరారయ్యాడు.

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ మార్కండేయ దేవాలయం వద్ద శుక్రవారం చైన్‌స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఓ మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కొని దుండగుడు పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ మెడలోనుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. ఈ ఘటన  చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈశ్వరీబాయి నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కమలారాణి(48) ఇంటి ఎదుట నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement