పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
డీపీఓ ఇళ్లలో ఏసీబీ సోదాలు
Nov 30 2015 11:07 AM | Updated on Aug 17 2018 12:56 PM
రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయితి శాఖలో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి అనే అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపధ్యంలో సోమవారం ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 10 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు. విజయవాడలో శ్రీధర్ కు చెందిన నివాసంతో పాటు హైదరాబాద్, తణుకు, ఏలూరు, వైఎస్ఆర్ జిల్లాలోనూ దాడులు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement