breaking news
sreedhar reddy
-
కొందరు హీరోలు నో చెప్పారు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్‌ని కొందరు పేరున్న హీరోలకు వినిపించాం. కథలో హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత తమ ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందంటూ నో చెప్పారు. కొత్త అబ్బాయితో వెళితే ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఎక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ లేవు. మా సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నాలుగేళ్ల క్రితం అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతానప్రాప్తిరస్తు 2’ చేయాలనుకుంటున్నాం. మన నేటివ్ సినిమాల్లో కంటెంట్ బాగుంటే అదే గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. పాఇండియా అవుతుంది. కరోనా తర్వాత ఓటీటీ డీల్స్ విషయంలో మార్పులు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల పేమెంట్స్ తగ్గిస్తున్నారు. భవిష్యత్‌లో నా దర్శకత్వంలో మళ్లీ సినిమా ఉండొచ్చు. కొత్త ఫిల్మ్‌మేకర్స్ మా మధుర ఆడియో పాటలను వినియోగించుకుంటే నేను డబ్బులు చార్జ్ చేయడం లేదు’’ అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఐటీ రంగం నుంచి వచ్చిన నేను ‘సంతాన ప్రాప్తిరస్తు’ తో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
పుట్టపర్తిలో నీటి కష్టాలు తీర్చింది సీఎం జగన్
-
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై రాళ్లు రువ్విన టీడీపీ నేతలు
-
జెడ్పీటీసీ పదవికి టీడీపీ నేత రాజీనామా
నెల్లూరు(అర్బన్): అధికార పార్టీకి చెందిన కొడవలూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు ఇరువూరు శ్రీధర్‌రెడ్డి తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. జెడ్పీ సమావేశాల్లో లేవనెత్తిన ఒక్క సమస్యకు తమ పార్టీ నాయకులతో సహా అధికారులు, మంత్రులు, పాలకులు పరిష్కారం చూపలేకపోయారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత పార్టీ, నేతల తీరును ఎండగట్టుతూ అలంకారప్రాయంగా మారిన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జెడ్పీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ వాటిని మంత్రులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జెడ్పీ సమావేశాల్లో జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడితే మంత్రులు, అ«ధికారులు సమాధానం చెప్పాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అధికార, ప్రతి పక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమకు అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారంటూ సొంత పార్టీ నేతల తీరుపైనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజీనామాకు కారణాలు ఇవే జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుందన్నారు. గ్రామాల్లో చెరువులను ఆక్రమించి రైతులకు నీళ్లు రాకుండా సెజ్ అధికారులు అడ్డుకున్నారన్నారు. జిల్లా పాలనాధికారి సహకారంతో రైతులపైనే కేసులు పెట్టారని తెలిపారు. ఈ సెజ్‌లో 3 వేల మంది రైతుల దగ్గర 3,300 ఎకరాలు సేకరించి కేవలం 254 ఎకరాలకే పరిహారం ఇచ్చారని తెలిపారు. బొడ్డువారిపాళెం సెజ్‌లో హైవేను ఆనుకుని ఉన్న భూమి ఎకరా రూ.40 లక్షలకు పలుకుతుంటే కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేశారన్నారు. నేషనల్ హైవే రోడ్డును విస్తరించే క్రమంలో మైనింగ్ ద్వారా గ్రామ పంచాయతీలకు సీనరేజీ రాయిల్టీ రావాల్సిన రూ.2.60 కోట్లను ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుందన్నారు. 14 పంచాయతీలు తమ గ్రామాలను నుడాలో కలపవద్దని తీర్మానం చేశారని తెలిపారు. నుడాతో ఈ పంచాయతీలకు తీవ్రనష్టం ఏర్పడుతుందన్నారు. నుడా అధికారులు ఈ 14 గ్రామాల ఆదాయాన్ని నెల్లూరుకు తరలించుకుపోతున్నారని, ఇదెక్కడి న్యాయమని తెలిపారు. ఈ విషయాలన్నింటిపై తాను .జెడ్పీ సమావేశాల్లో అధికారులను, మంత్రులను నిలదీసినా.. ప్రభుత్వం తమదే అయినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని దుయ్యబట్టారు. తాను కిసాన్ ఇఫ్కో సెజ్‌పై కోర్టులో కేసు దాఖలు చేశానని, వచ్చే 14న తీర్పు తమకే అనుకూలంగా రాబోతుందన్నారు. ఇఫ్కో భారీ స్థాయిలో తమకు ముడుపులు చెల్లించేందుకు సిద్ధపడి కేసును వాపసు తీసుకోవాలని కోరిందన్నారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు అండగా నిలబడ్డారని, రైతుల పక్షాన మాట్లాడినప్పటికీ ప్రభుత్వం ఎమ్మెల్యే మాటలను సైతం పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఈ 14 పంచాయతీల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. ఇదిలా ఉండగా రాజీనామా లేఖను తీసుకునేదానికి జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుంధర అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం కలెక్టర్ ముత్యాలరాజుకే జెడ్పీటీసీలు నేరుగా రాజీనామా ఇవ్వాలన్నారు. దీంతో తన రాజీనామా ప్రతిని కలెక్టర్‌కు ఇచ్చేందుకు వెళ్లారు. -
డీపీఓ ఇళ్లలో ఏసీబీ సోదాలు
-
డీపీఓ ఇళ్లలో ఏసీబీ సోదాలు
రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయితి శాఖలో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి అనే అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపధ్యంలో సోమవారం ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 10 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు. విజయవాడలో శ్రీధర్ కు చెందిన నివాసంతో పాటు హైదరాబాద్, తణుకు, ఏలూరు, వైఎస్ఆర్ జిల్లాలోనూ దాడులు కొనసాగుతున్నాయి. -
బిజెపి నేత శ్రీధర్‌రెడ్డితో సాక్షి వేదిక


