తనని తప్పుగా అనుకుంటున్నారని.. | 10 student suicide in ananthpur distirict | Sakshi
Sakshi News home page

తనని తప్పుగా అనుకుంటున్నారని..

Aug 1 2015 10:16 AM | Updated on Nov 6 2018 7:56 PM

చుట్టుపక్కల వాళ్లు తన గురించి తప్పుగా అనుకుంటున్నారనే బాధతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

పెనుకొండ: చుట్టుపక్కల వాళ్లు తన గురించి తప్పుగా అనుకుంటున్నారనే బాధతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన భావన(15) స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో పెనుకొండకు చెందిన ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేశాడు.

ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాలిక తిరిగి ఇంటికి చేరింది. ఈ విషయం పై తన గురించి చుట్టుపక్కల వాళ్లు తప్పుగా అనుకుంటున్నారని మనస్థాపానికి గురైన భావన శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రపోయిన తర్వాత చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement