ముందస్తుతో ఆ ‘రెండూ’ మునగడం ఖాయం

Solipeta Ramalingareddy Article On Early Elections In Telangana - Sakshi

సందర్భం

అంపశయ్య మీద ఉన్న పార్టీలన్నీ ‘ఇప్పుడు  ఎన్నికలు ఎందుకు’ అని అడుగుతున్నాయి. ఈ పార్టీల నేతలకు ముందస్తు ఎన్నికలు మింగుడు పడతలేదు. చంద్రబాబు నాయుడుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలంటే లెక్కేలేదు. ఎన్ని అడ్డదార్లు తొక్కి అయినా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలాసఫీ. పిల్లనిచ్చిన పాపానికి  సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేశారో లెక్కే లేదు. ఇప్పుడు అధికారం కోసం మరోసారి అపవిత్ర పొత్తులకు తెరతీస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వస్తారట. తెలంగాణ నీళ్లను ఎట్లా  దారిమళ్లించుకొని తీసుకుపోదామని నిత్యం ఆలోచించే బాబుతో మన కాంగ్రెస్‌ వాజమ్మలు పొత్తుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వాళ్లకా తెలంగాణ ప్రజలు ఓటు వేసేది? తెలంగాణలో టీడీపీ కూకటి వేళ్లతో కూలిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ వటవృక్షం తెలంగాణలో కూలిపోవటం ఖాయం.

అధికార పార్టీని ఇరకా టంలో పెట్టడానికి  ‘ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా’ అంటూ ప్రతిపక్షాలు  సవాలు విసురుతాయి. ఏడాది ముందుగానే కేసీ ఆర్‌ ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిలబడితే ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు అంటు న్నాయి. సంచలనాలు, సాహస నిర్ణయాలకు  కేసీఆర్‌ మారు పేరు. నేడు తెలంగాణలో ప్రగతి రథచక్రం పరుగులు పెడు తోంది. వర్గపోరుతో బజార్ల పడుతున్న  ప్రతిపక్ష కాంగ్రెస్‌కి ఈ వేగాన్ని తట్టుకునే  సామర్ధ్యం లేక బేల చూపులు చూస్తోంది. 60 ఏళ్ల వలసాంధ్ర పాలనలో తెలంగాణను పీల్చి పిప్పిచేశారు. కేసీఆర్‌  నాయ కత్వంలో అవతరించిన బంగారు తెలంగాణ నాలు గేళ్ల  పసికూన. ఈ నాలుగేళ్ల కాలంలోనే 40 ఏళ్లంత వేగంగా అభివృద్ధి జరిగింది. ఈ పరిపాలన చూపించే కేసీఆర్‌ ప్రజాతీర్పుకు íసిద్ధమయ్యారు. ఇక్కడో యదార్థం చెప్పాలి. నీళ్లు లేక అల్లాడుతున్న జనం బాధలు చూడలేక జడ్చర్లకు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత పాతికేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వద్దకు పోయి ‘అయ్యా గుక్కెడు నీళ్లు లేక మా ప్రాంత జనం వలస పిట్టలైపోతున్నారు. జూరాల నీళ్లిచ్చి చెరువు నింపండి’ అని అడిగితే, ఆ సీఎం వెటకారంగా ‘అరే, రెడ్డికి గొంతెండి పోతుందట. చెంబుల నీళ్లు పట్రారా’ అని ఆయనకు చెంబులో నీళ్లు తాపిచ్చి ‘ఇగపో’ అన్నాడట. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతాన్ని వెను కబాటుతనంలో ఉంచారు.

మద్రాసు రాష్ట్రంలో మద్రాసు నగరానికి రాళ్లు ఎత్తటానికి, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, ఆంధ్రప్ర దేశ్‌లో హైదరాబాద్‌ నగరానికి, ఇలా దేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా లక్షల సంఖ్యలో కూలీలను తరలించటానికి పాలమూరు జిల్లాను రిజర్వు చేసి పెట్టారు. అందుకోసమే సారవంతమైన తీర భూము లున్నా, వాటికి సాగునీటిని కల్పించే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారు. 1.02 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల ప్రాజెక్టు, 87,500Sఎకరాలకు నీళ్లిచ్చే సామర్ధ్యం ఉన్న రాజోలిబండ (ఆర్డీఎస్‌), 1.10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే సామర్ధ్యం ఉన్న  భీమా, 3.40 లక్షల ఎకరాలకు నీళ్లనిచ్చే కల్వకుర్తి, 2 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగే నెట్టెంపాడు ఎత్తిపో తల పథకాలు ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గుతూ వచ్చాయి. 2.28 లక్షల ఎకరాలకు సాగు నీళ్లనిచ్చే చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కల్వకుర్తి ప్రాజెక్టుకు 30 ఏళ్లు నిండాయి. ఇప్పుడు అనేక ప్రాజె క్టులు ముగింపునకు వచ్చాయి. అభివృద్ధి ఫలాలు జనం అనుభవిస్తున్నారు. పాలమూరు భూముల్లో 9 లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతున్నాయి. ఎన్నికల హమీ లను అమలుచేస్తూనే, డెబ్బయికి పైగా కొత్త పథ కాలు అమలు చేశారు.

కేసీఆర్‌ చిత్తశుద్ధితో పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో మన పొలాలకు నీళ్లు పెట్టుకుందా మని సాగర్‌ నీళ్లకోసం పోతే చంద్రబాబు నాయుడు పోలీసులను పెట్టి మన అధికారులను కొట్టించారు. ఢిల్లీకి పోయి పంచాయితీ పెట్టించారు. పాలమూరు ఎత్తిపోతలు, మల్లన్న సాగర్‌ మీద దొంగ కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.  తెలంగాణను అస్థిర పరచాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఉసిగొల్పిన రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరిని  కోట్లు ముట్టజెప్పి కొనాలని ప్రయత్నించి దొరికిపో యారు. తన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని చంద్ర బాబు తెలంగాణకు వచ్చి చెబుతారు. ఏపీకి పోయి రాత్రికి రాత్రే అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని, దాన్ని తాము వ్యతిరేకించామని అమాయకంగా మాట్లాడతారు. కేసీఆర్‌ ఇవన్నీ తట్టుకున్నారు. అన్ని టికి  నిబడ్డారు. ఓ వైపు  చంద్రబాబు ఆగడాలను అడ్డుకుంటూనే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపుగా నడిపించారు. తెలంగాణ అభివృద్ధిని స్వయంగా చూసిన ప్రధాని మోదీ నిండు పార్లమెంటులో ‘రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూస్తున్నా. కేసీఆర్, చంద్రబాబు గొడవలతో నా దగ్గరకు వచ్చే వాళ్లు. చంద్రబాబు నాయుడిది ఇప్పటికీ అదే ఏడుపు. కానీ కేసీఆర్‌ అభివృద్ధి మీద దృష్టిపెట్టారు. రాష్ట్రాన్ని అభి వృద్ధి చేసుకుంటున్నారు’ అని చెప్పారు. నిజానికి మోదీ మాకు రాజకీయ ప్రత్యర్ధి. అయినా కేసీఆర్‌ కార్యదక్షతకు ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఇన్ని విజయాలు, ఇంత వేగవంతమైన అభి వృద్ధి  చేసి చూపించారు గనుకనే కేసీఆర్‌ మరోసారి అవకాశం ఇవ్వండని ప్రజల్లోకి వచ్చారు. శాసన సభను రద్దు చేసిన వెంటనే 105 స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించారు. వేగంగా జరుగుతున్న పరిణా మాలతో దిమ్మతిరిగిపోయిన ప్రతిపక్షపార్టీలు, తమ పరిస్థితి ఏమిటో, తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియక ఆలోచనలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపిక, అంతర్గత కలహాలు, కాంగ్రెస్‌ విషయంలో అయితే అధి ష్ఠానముద్ర– ఇన్ని సమస్యలతో అంపశయ్య మీదున్న పార్టీలన్నీ , ‘ఇప్పుడు  ఎన్నికలు ఎందుకు’ అని అడుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువుదాకా సాగదీసి, కోట్లకు కోట్లు మూటగట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అలవాటున్న  ఈ పార్టీల నేతలకు ముందస్తు ఎన్నికలు మింగుడు పడతలేదు. చంద్రబాబు నాయుడుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలంటే లెక్కేలేదు. ఎన్ని అడ్డదార్లు తొక్కి అయినా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలా సఫీ. పిల్లనిచ్చిన పాపానికి  సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. సోదర రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలి. అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలనే ఆలోచనతో 10 ఏళ్లపాటు హైదరాబాద్‌లో ఉండనిద్దా మనుకుంటే ఆయన నమ్మక ద్రోహానికి  ఒడిగట్టారు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని అడ్డదార్లు తొక్కారో లెక్కే లేదు. ఇప్పుడు అధి కారం కోసం మరోసారి అపవిత్ర పొత్తులకు తెర తీస్తున్నారు. కాంగ్రెస్‌తో పెట్టుకొని ప్రజల్లోకి వస్తా రట. తెలంగాణ నీళ్లను ఎట్లా  దారిమళ్లించుకొని తీసుకుపోదామని నిత్యం ఆలోచించే బాబుతో మన కాంగ్రెస్‌ వాజమ్మలు పొత్తుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వాళ్లకా తెలంగాణ ప్రజలు ఓటు వేసేది? తెలంగాణలో టీడీపీ కూకటి వేళ్లతో కూలిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ వట వృక్షం తెలంగాణలో కూలిపోవటం ఖాయం.

సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
దుబ్బాక శాసన సభ్యులు 94403 80141

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top