వారఫలాలు (8 డిసెంబర్‌ నుంచి 14 వరకు)

Weekly Horoscope Of December 7Th To December 14th 2019 In Sakshi Funday

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలకు హాజరవుతారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఉద్యోగ ప్రయత్నాలు పెండింగ్‌లో పడతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. విద్యార్థులు మరింత కష్టపడితే ఫలితం దక్కించుకుంటారు. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. అందరిలోనూ మీ ప్రత్యేకతను చాటుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు లేదా కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా కొనసాగి రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఎంతటి వ్యవహారాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఆకుపచ్చ రంగులు,  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు గతం కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని పదోన్నతులు ఆశ్చర్యపరుస్తాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తీర్థయాత్రలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఎరుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి. అనుకున్న సమయానికి సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఆత్మీయులతో విభేదాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి, అయితే కొంత కష్టపడాలి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాలు లేదా కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళం తప్పకపోవచ్చు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులు పరిచయమై చేయూతనిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. వారం చివరిలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వ్యాపారాలు మరింత లాభించవచ్చు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థికపరంగా చికాకులు ఎదురుకావచ్చు. కొత్త రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. తీర్థయాత్రలు చేస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకునేందుకు శ్రమిస్తారు. రాజకీయవర్గాల యత్నాలు మందగిస్తాయి. వారం చివరిలో విందువినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశపరచినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహన యోగం. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాల ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులలో ఆటంకాలు ఎదురై నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు నెలకొనవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమై కొంత సాయపడతారు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top