రాగాలు కురుస్తాయి... | Shower Head plus wireless speaker | Sakshi
Sakshi News home page

రాగాలు కురుస్తాయి...

Jun 25 2016 10:45 PM | Updated on Sep 4 2017 3:23 AM

రాగాలు కురుస్తాయి...

రాగాలు కురుస్తాయి...

బాత్‌రూమ్ సింగర్స్ అనే మాటను తరచూ వాడుతుంటాం. మరి అదేం విచిత్రమో.. స్నానం చేసేటప్పుడు పాటలు పాడాలని...

కొత్తకొత్తగా
బాత్‌రూమ్ సింగర్స్ అనే మాటను తరచూ వాడుతుంటాం. మరి అదేం విచిత్రమో.. స్నానం చేసేటప్పుడు పాటలు పాడాలని, వినాలని ఎందుకనిపిస్తుందో తెలియదు. బాత్‌రూమ్‌లో పాడటం అందరూ చేసే పనే. కానీ వినడమో... ఎలా? ఫోన్లను, హోం థియేటర్లను అందులోకి తీసుకెళ్లలేం కదా.. కాబట్టి మనకు మనం పాడుకోక తప్పదు. ఇది ఒకప్పటి మాట.. ఇకపై బాత్‌రూమ్‌లోకి లౌడ్ స్పీకర్లను తీసుకెళ్లొచ్చు. ఎలా అంటారా? ఒకసారి పక్కనున్న ఫొటోలను చూడండి. షవర్‌హెడ్ మధ్యలో ఉన్నదే స్పీకర్.

దీనిపై షవర్ వాటర్ ఒక్క చుక్క కూడా పడదు.. సో వెరీ సేఫ్.. ఇదేదో కొత్తగా ఉంది కదా.. అవును, ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ‘షవర్‌హెడ్ ప్లస్ వెర్లైస్ స్పీకర్స్’ అందుబాటులోకి వచ్చాయి. దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. 32 అడుగుల దూరంలో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేస్తే.. బాత్‌రూమ్‌లో షవర్ ఆన్ చేయగానే మ్యూజిక్ ఆన్ అవుతుంది. దాంతో ఎంచక్కా పాటలు వింటూ.. కూనిరాగాలు తీస్తూ స్నానం చేయొచ్చు. దీని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే.. ఏడు గంటల వరకు పాటలను నిరంతరాయంగా వినొచ్చు.

Advertisement

పోల్

Advertisement