వరం ఫలితం

A priest is a woman Born to be a man in the stomach - Sakshi

 కథా ప్రపంచం

మనిషికి సంబంధించిన వాటికంటే, ఆదాము అనుయాయులు ఇతర స్వభావాలతో పుట్టడం జరుగుతూంటుంది. ఎవరో ఒకరు మీకు ఆ వృక్ష, జంతు జాలాలు ప్రత్యేకంగా గుర్తుచేస్తుంటారు. ఒకసారి ఓ పూజారి మహిళ కడుపున మనిషిగా జన్మించాడు. కానీ అతను చూడ్డానికి కాకి, దాతుర, కాక్టస్‌లకు జన్మించినవాడిలా ఉన్నాడు. తమ పిల్లవాడే అయినప్పటికీ వాడి వికృతచేష్టలకు భయపడి తల్లిదండ్రులు పిల్లవాడిని అమ్మవారి గుడికి పంపించారు, అక్కడ ఆమె కరుణతో మార్పు వస్తుందని. కానీ ప్రతీరోజు కాక్టస్‌కు పాలు, వెన్న పెట్టినా, అది కాక్టసే కదా. ఈ బ్రాహ్మణుడు చందనం ఎంత రాసుకుంటాడో, జపమాలతో అంత ధ్యానం చేస్తాడు. దేవీపూజ చేస్తాడు. భంగ్, గంజాయి తీసుకుంటాడు. పగలు, రాత్రీ అతని కళ్లు కాగడాల్లా ఎర్రగా ఉంటాయి. బండ పెదవులు, పచ్చని పలువరస పొట్టవరకూ గడ్డం, జుత్తు మేటవేసి పక్షి గూడులా ఉంటుంది. పైకి కట్టబడి ఉంటుంది. పొడవాటి మెడ, శరీరమంతా ఎలుగుకిలా జుత్తు.అదృష్టవశాత్తూ, ఈ బ్రాహ్మణుడి భార్య ఎంతో సాదాసీదా మనిషి. భయస్తురాలు. కానీ అతను కొట్టాలనిపించినపుడల్లా కొడుతూంటాడు, అదో రోజూవారీ కార్యక్రమంలాగా.

ఆమె కూడా  భర్త చేత తన్నులు తినడం కుటుంబ జీవితంలో భాగంగా భావిస్తుంది. వండటానికి ఏమీ లేనపుడు ఆమె ఎంతో ఆందోళనపడుతుంది. ఆ సమయంలో దేవతకు అర్చనగా పెట్టేది చాలా స్వల్పం. దీంతో బతుకుడు కష్టం. పైగా ఇటువంటి బ్రాహ్మణుడితో ఆమెకు దైవభక్తి రెండింతలయింది. అర్చనలు రోజు రోజుకీ తగ్గిపోయాయి. గుడిలో అమ్మవారికీ ఆందోళన పట్టుకుంది.ఒకరోజు రాత్రి భోజనం తర్వాత కాస్తంత గంజాయి లాగించి నిద్రకి ఉపక్రమిస్తూ భార్యతో ‘‘మన అమ్మవారు చాలా తక్కువస్థాయి మనిషి. పూజారే యింత దరిద్రంలో వుంటే ఈ దేవతను ఎవరు మాత్రం పూజిస్తారు?’’ అన్నాడతను. రోజూ ఈ పూజా పునస్కారాలతో ఏమి ప్రయోజనం లేదు. గుడికి వెళ్లి దేవతతోపాటు తగలబడదామనిపిస్తోంది. ఇహ కొన్ని రోజులు వేచి చూస్తా, ఆ తర్వాత నువ్వే చూద్దువు... ఆమెకు బుద్ధి చెబుతాను’’ అన్నాడు.‘‘నన్ను అలా వదిలేసి వెళ్ళకండి’’ ఈ లోకంలో భర్త లేకుండా  ఒంటరిగా ఎలా బతకగలను?’’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఓహ్‌! ఆ సంగతి ఆలోచించనేలేదు. నయం పైకి చెప్పావు. మంచిది.’’మంచం మీద కూర్చున్నాడు.

అతని భార్య వచ్చి ‘‘ఇలా జరగకుండా ఉండాల్సింది! నన్నింకా తన్నకుండానే ఎలా నిద్ర పోతారు?’’ అంది.ఇప్పుడు పిల్లాడిలా ఆ బ్రాహ్మణుడు తనను తాను మర్చిపోయి ఒకటి లేదా రెండుసార్లు నవ్వాడు. నవ్వడం అనేది అతని పెదవుల మీదికి వచ్చినప్పటి నుంచీ, దాని జ్ఞాపకం అతనికి అంతగా లేదు. భార్య మాట వినగానే, మొదటిసారిగా పెదవులపై చిర్నవ్వు మెరిసింది.‘‘నీకు విశ్రాంతి కావాలంటే నేను తన్నాలా? నీకు ఆశ్చర్యం కలగవచ్చుగానీ, నేను మనిషిగా భావించినప్పుడు మాత్రమే నిన్ను కొడుతూంటాను. మనకి పిల్లలు ఉంటే, వాళ్లనీ కొట్టేవాడిని. ఇప్పటినుంచీ ఎవరిపైనా చెయ్యెత్తితే, అది ఆ దేవత మెడమీదే. ఒక గొడ్డలి సంపాదించి వెళ్లి ఆ దేవత విగ్రహాన్ని ముక్కలు చేస్తాను. అంతా తగలబెడతాను, లోపల ఉండి పోయి. ప్రశాంతంగా మరణిస్తాను, చూడు. ఒకవేళ నేను మర్చిపోతే నాకు గుర్తుచెయ్యి. మర్చిపోకు. రాబోయే పౌర్ణమిని అలా వట్టిగా పోనీయద్దు.’’కాలం విస్ఫోటాన్ని సైతం పట్టించుకోదు. ఈ పిసినారి, పిచ్చిబ్రాహ్మణుడిని పట్టించుకుంటుందా? పగలు, రాత్రి కాలచ్రకంలో అలా సహజసిద్ధంగా కదలిపోతున్నాయి. చివరగా పౌర్ణమి రానే వచ్చింది.

దేవత ఆగ్రహించింది. ఆ పిచ్చాడు ఏం చేయబోతున్నాడో చెప్పనయినా చెప్పలేదు! ఒక్కక్షణం నమ్మకస్తుడి విశ్వాసం సన్నగిల్లితే ఆమె పేరు జపించేవారు ఒక్కరయినా  మిగలరు. పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆమె తన భర్తకి ప్రమాణాన్ని గుర్తుచేసింది.అతను  కోపగించుకున్నాడు, వెర్రెత్తిపోయాడు, ‘‘బుద్ధిహీనురాలా! మంచి నిద్రలోకి వెళ్లే సమయంలోనా చెప్పేది?  రేపు ఉదయాన్నే మొదటగా చెప్పు!’’ అన్నాడు.మర్నాడు ఉదయం  ఆ బ్రాహ్మణుడు గుడికి వెళుతోండగా, అతని భార్య వేరే పనుల్లోపడి అతనికి గుర్తుచేయడం మర్చిపోయింది. దీంతో అతనికి మరింత కోపం వచ్చింది. ‘‘ఎన్నిసార్లు చెప్పాను. నాకు గుర్తుచేయమని, అయినా నువ్వు మర్చిపోయావ్‌! నేను యివాళ ఎవరి దగ్గర్నుంచయినా ఓ సుత్తిని  తెద్దామనుకున్నాను. చెక్కలు కొట్టడానికి.’’గుడిలో అమ్మవారు ఆలోచనలో పడింది. హారతుల మీద దృష్టి పెట్టలేకపోతోంది. ఆమెకు  ఈ బ్రాహ్మణుడి సంగతి బాగా  తెలుసు. అతడిని శాంత పరిచేందుకు ఏదో ఆలోచన చేయాలి. అదే మంచిదనిపించింది.సూర్యాస్తమయ సమయానికి బ్రాహ్మణుడు ఆ రోజుకు చివరగా పూజచేస్తున్నాడు.

అమ్మవారు విగ్రహం నుంచి వచ్చి ప్రత్యక్షమయింది. తలనించి పాదాల వరకూ ఎంతో విలువయిన వజ్రవైడూర్యాలతో మెరిసిపోతోంది. గర్భగుడి అంతా వేయి దీపాల వెలుగుగా ఉంది. బ్రాహ్మణుడు తల ఎత్తి చూశాడు. తన పక్కనున్న ఒకే ఒక్క భక్తుడు, అదో మహా అదృష్టంగా భావించాడు. ఆమె అంది, ‘‘కుమారా! ఇన్నాళ్లూ నిన్ను పరీక్షిస్తున్నాను. మరి కొంతకాలం వేచి ఉన్నట్లయితే. నీకు ఏకంగా ఇంద్రుని సింహాసనమే లభించేది. కానీ, ముందే నువ్వు సహనం కోల్పోయావు. అయినా ఫరవాలేదు, నువ్వు ఏది అడిగితే అది ప్రసాదిస్తాను’’ అన్నది.అతను భయపడకుండా అడిగాడు, ‘‘నేను ముందే చనిపోతే ఏమవుతుంది?’’ అని.ఆమె నవ్వింది.‘‘అది జరగకుండా చూస్తాను. దివ్యరాజ్యంలో రవ్వంత ఆలస్యం కారణంగా నీ జన్మ చాలా ఆలస్యం జరిగింది.’’ఆమె వచ్చినంత వేగంగా మాయమయితే ఏమవుతుంది? ఏమీ ఉండదు. అందువల్ల అతను చాలా కచ్చితంగా, ‘‘నీ నగలన్నీ నాకివ్వు. మనిద్దరం చాలా ప్రశాంతంగా జీవించొచ్చు.’’ అన్నాడు.‘‘కానీ ఆభరణాలు లేకుండా నేను ఉండకూడదు. మానవులకు దేవతల ఆభరణాలు ఉపయోగపడవు.

మీరు తాకితే అవి మట్టిగా మారిపోతాయి.’’‘‘అందుకనా, నేను ఏది అడిగితే అది యిస్తానన్నావు? నాకు కావలసినదే నేను అడిగాను. అయినా, నా యిబ్బందులు నీ నుంచీ దాచలేను. నువ్వు నిజంగా నాకు వరం యివ్వదలిస్తే ఇచ్చేయ్‌. నీకిష్టమైనది ఇవ్వదలచుకున్నదయినా సరే, యివ్వు.’’ఎంత ధైర్యం! ఆమె అతికష్టం మీద కోపం అణచుకుంది. ఈ భక్తుడి గురించీ ఆమెకు బాగా తెలుసు. సుఖసంతోషాలతో వున్నవాడెవడూ యింత నిర్లక్ష్యంతో ఉండడు. కానీ ఈ బ్రాహ్మణుడు ఎంత భోగాన్ని రుచి చూసినా, చాలా సున్నితమయినవాడు! కనుక ఆమె చింతించనవసరం లేదు. ఇటువంటివాడే చుట్టూ ఉన్నవారంతా అసహ్యంగా కనిపించడానికి ముక్కు కోసేసుకోగలడు. అంచేత అతనికి ఆవేశం కలిగించే వరం యివ్వాలి. చుట్టపక్కల వారందరికీ మరింత వరాలివ్వాలి. అది అతనికి ఈరష్య కలిగిస్తుంది. ఆమె అన్నది, ‘‘ఇన్నాళ్లు నన్ను పూజిస్తున్నావు. అయినా నీ మనసు స్వచ్ఛంగా మారలేదు. నీ హృదయంలోని ఆ అగ్నిని చల్లార్చుకో. అది రేగినప్పుడల్లా యితరులకు సహాయం చెయ్యి.’’సలహా వినడంతో అతను నీరసపడ్డాడు.‘‘ఇదేం మాట? అంతా నాకు ముందే తెలుసు.

బోధన చేయడం ఆపి నాకు ఒక్క వరం యివ్వు.’’‘‘నువ్వు నిజంగా కోట్లలో ఒక్కడివి. నీ మొండితనం ఎంతో నచ్చింది. ఆ మూర్ఖులతో నాకు ప్రయోజనం లేదు. ఎప్పుడూ ఏడుస్తూ, అడుక్కు తింటూంటారు. ఇక్కడ నీ ఆసక్తిని నువ్వు పట్టించుకోలేవు. ఇప్పటినుంచీ నీ బాగోగులు నేను చూసుకుంటాను.’’‘‘చాలా సంతోషం. ఇంత గొప్ప ఆలోచనతో పోవడానికి యింత కాలం పట్టిందా?’’అమ్మవారు దయతో నవ్వి, ‘‘నీకిచ్చు వరం వంటిది యింతవరకూ ఎవరికీ లభించలేదు. నీతోపాటు యితరులకూ ఎంతో లబ్ధి కలుగుతుంది.’’‘‘యితరులూ లబ్ధిపొందుతారా? అంతకంటే దారుణం మరోటి ఉంటుందా? ఇలాంటి వరంతో  ప్రయోజనం లేదు.’’‘‘ఒకదాని తర్వాత ఒకటి యిలా అనేక కష్టాలు జీవితమంతా అనుభవిస్తున్నావు. కోపగించుకుంటే ప్రయోజనం లేదు. వెళ్లు. ఇవాళ్టి నుంచీ నువ్వు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది.’’‘‘దీన్ని వరం అంటావా? శాపం కన్నా దారుణం! నీవు ఇచ్చిన ఈ వరంతో పోలిస్తే నా దారుణమయిన జీవితమే వేయి రెట్లు నయం. తెలివిలేని నీ వరాన్ని వెనక్కి తీసుకో, నన్ను వదిలేయ్‌’’ అన్నాడు.అతను ఆ మాట అనగానే ఆమ్మవారు కనిపించినంత వేగంగా ఆశ్చర్యంగా మాయమయింది.

ఆలోచనలో పడ్డాడు. ఇంటికి వెళ్లి ఈ సంగతి తన భార్యతో చెప్పాలనుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అమ్మవారు ఒక వరాన్ని యిచ్చింది.’’అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అతను గుడి నుంచీ యింటికి వెళ్లాడు. గుమ్మంలో అతని భార్య వేచి ఉంది. ‘‘ఏమయింది? ఏమిటా తొందర?’’ గాబరాతో అడిగింది.బ్రాహ్మణుడు తనకు అమ్మవారు వరం యివ్వడం గురించీ అంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు ఇన్నాళ్లూ ఆమె పడ్డ కష్టాలు కష్టాలు కాదన్నంతగా అయింది. ఆమె ఆనందానికి అంతేలేదు. అతనితో అంది, ‘‘నాకు తెలుసు పూజల్లో యిన్నాళ్లు గడిపిన సమయమంతా వృ«థాపోదని.’’‘‘గొప్ప ఫలమా? ఏమంటున్నావు? నేను ఏదో పొందితే అది యితరులకు అంతకు రెండింతలు లభిస్తుంది. ఇంతకంటే దారుణ శాపం విని ఉండవ్‌. నువ్వుగాని భంగు తాగావా?’’‘‘మహిళగా నేను మీకు సలహానిచ్చే అర్హత లేకపోవచ్చు. కానీ, నిజానికి యితరులకు మనకంటే రెండింతలు లాభిస్తే నష్టమేమిటి? ఇన్నాళ్లూ ఎన్నో కష్టాలను భరించాం. మనం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. సౌఖ్యమేమిటో మనకూ తెలుస్తుంది. యిక మీ యిష్టం. దాన్ని గురించి ఆందోళన చెందాల్సిందేముంది? మీ నిరాశతో నా అదృష్టాన్ని కాదనుకుంటాను.

మీరు నాకు ఈ చిన్న ఆనందపు మెరుపు ఎందుకు ప్రసాదించలేదు?’’‘‘నువ్వు చెప్పింది సబబే. అదెలా పనిచేస్తుందో చూద్దాం.. ఏమయినప్పటికీ అమ్మవారు మనకు మార్పు తేవడానికి వరం యిచ్చిందేమో?’’ అన్నాడు సాలోచనగా.కానీ మొదటగా ఏమి కోరుకోవాలి? హఠాత్తుగా అతనికి తన పగిలి పోయిన పైపు, ఖాళీ గంజాపాత్ర గుర్తుకు వచ్చాయి. ‘‘అమ్మా, నువ్విచ్చిన వరమే నిజమైతే, నాకు ఓ కొత్త పైపు, గంజాతో నిండిన పాత్రనీ ప్రసాదించు’’ అన్నాడు.అతని పెదవుల నుంచి మాట బయటకు వచ్చిందో లేదో, కోరిన బహుమతులు ప్రత్యక్షమయ్యాయి. అవి చూసినవారు ఆశ్చర్యంతో బొమ్మల్లా ఉండిపోయారు. ఇంత సులభంగా ప్రతీ కోరికా తీరితే, వారి ఆనందానికి అంతేదీ! గంజాను పైప్‌ నిండా కుక్కి దాన్ని అంటించడానికి అతని భార్య నిప్పుకణిక తెచ్చింది. తర్వాత ఏం కోరుకోవాలో ఆలోచిస్తున్నాడు. జీవితమంతా వాళ్లు నానా కష్టాలూ పడ్డారు. ఇప్పుడు మంచిది ఏది అడగాలి? ఇదా లేక అదా, అదా లేక ఇదా? మనసు ముడి వీడటం లేదు. కోరడానికి అనేకం ఆలోచించాడు. భార్యను సంతోష పెట్టడానికి పిండి, ఉప్పు, సుగంధద్రవ్యాలు, వంటచెరకు కావాలి.

ఒక నిమిషం కొన్ని వస్తువుల గురించి అడుగుతాడు. మరుక్షణం అవి అతని ముందుంటున్నాయి.భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంలో తలమునకలవుతున్నారు. పొయ్యి వెలిగించడానికి అతని భార్య పరిగెట్టుకెళ్లింది. ఎందుకు సందేహించడం? అతను ఎంత ఆనందంగా ఉన్నాడో అంతగా యిబ్బందిపడుతున్నాడు. అతని చుట్టుపక్కలవారు  రెండింతలు పొందుతున్నారు. అదేం తప్పుకాదే.బ్రాహ్మణుడి భార్య తన భర్తకి భోజనం పెట్టి తాను తినడానికి కూర్చుంది. సంతృప్తిగా భోజనం చేయడం కంటే ఆనందం మరోటి ఉండదు. బ్రాహ్మణుడు తన జీవితంలో మొదటిసారి సంతృప్తిగా భోజనం చేశాడు. కానీ అది విచారపరిచింది. తన భార్య దగ్గరికి వెళ్లి ‘‘నాకో పని చేసిపెడతావా?’’ అని అడిగాడు.‘‘నీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా? ఇంత హఠాత్తుగా అడిగారు?’’‘‘కాదంటే, నేనే సమాధానం చెబుతాను. ఊళ్లోకి వెళ్లు. ప్రతీ యింటా మనకంటే రెండింతలు ఉన్నదీ లేనిదీ చూసిరా.’’‘‘ఇతరుల సంగతి మనకెందుకు? మనం యిప్పుడు చిన్న దీపందివ్వె కోసమయినా యితరులను అడుక్కోనక్కర్లేదు. అంతేగాదు ప్రతీవారు మీ వల్లనే ఎంతో సమృద్ధులవుతున్నారు.

మనకంటే తక్కువేమీ అభివృద్ధి చెందడంలేదు!’’ఆమె యిల్లు చేరేసరికి ఆమె భర్త విచారంతో కూచోనున్నాడు. ఆమె రాక తెలిసి తలెత్తి, ‘‘నిజమేనా? మనకంటే వాళ్లంతా రెండింతలు పొందారా?’’ అడిగాడు.పూజారి భార్య అవునని చెప్పగానే, అతనికి చెవుల్లో తుపాకులు పేల్చినట్లయింది. అతనికి తెలియనివాటి గురించి అతనికి దిగులు లేదు, కానీ, తన గ్రామంలో ప్రజలంతా పొందుతున్నవాటి గురించి అమితాశ్చర్యపడ్డాడు. కనీసం ఒక్కరైనా కృతజ్ఞతలు చెప్పలేదు. దుర్మార్గులు ఒక మాట అనలేదు. ఇటువంటి ద్రోహులకు సహాయపడటం పాపం అనుకున్నాడు. పిచ్చెత్తిపోయాడు. మంచంమీద పడిపోయాడు. అతని భార్య అతని చేతులు, కాళ్లూ రుద్దడం ఆరంభించింది.కొంతసేపటికి అతన్ని ఇలా శాంతపరిచింది, ‘‘ఏమీ లేనివాని కోసం ఎందుకు అంతగా బాధపడతారు. లోకం కాలిపోని, మనకేంటి?’’ అంది.‘‘అంత సులభంగా అందరినీ అలా వెళ్లనిస్తాను? అదే నిజంగా జరిగితే, నేను నిశ్చింతగా ఉంటాను.’’‘‘శ్వాస ఉన్నంతకాలమే ఈ లోకం ఉండేది. నీ గురించీ జాగ్రత్తపడు. మిగతావన్నీ సక్రమమవుతాయి. అద్దంలో చూడు. ఎంత ఆరోగ్యంగా ఉండేవాడివి.

నా కళ్ల ముందే చిక్కి శల్యమయ్యావు. ముందు ఆరోగ్యంగా తయారవు. తర్వాత నువ్వు ఏం చెయ్యదల్చుకుంటే అది చేద్దువుగానీ. జీడిపప్పు, పాలు తీసుకురా నీకు పాయసం, లడ్డూ, హల్వా చేస్తాను రాత్రి భోజనంలోకి.’’ఆమె అడిగింది‘‘నా చేతులతో నేనే వీటిని వండాలా? నాకు మంచి పెనం, వెండి గిన్నెలు కావాలి.’’ అని.ఆశ్చర్యంగా బ్రాహ్మణుడు జాబితాలో పెనం, గిన్నెలు వేపు చూశాడు. వంటసామగ్రి ఆమె ఎదుట క్షణంలో ప్రత్యక్షమయ్యాయి. ఆమె హల్వా చేయడానికి యిక ఆట్టే సమయం పట్టలేదు.బ్రాహ్మణుడు నోరారా వేడి వేడి హల్వా తిన్నాడు. తర్వాత తన భార్యవంక చూసి, ‘‘నేను కలగంటున్నానా?  కళ్లు తెరిచే ఉన్నాయా? నన్ను సరిగా చూసి చెప్పు.’’‘‘ముందు నువ్వే చెప్పు, తెరిచే ఉన్నాయా?’’‘‘అవును. విప్పారి ఉన్నాయి. ఇవాళ మన సొంత పొయ్యి మీదే హల్వా చేసుకున్నాం. నిన్నటి వరకూ ఊహించనివన్నీ ఇవాళ మన కళ్లతో చూస్తున్నాం.’’వాళ్లకి తెలీకుండానే, ఆనందం అనుభవించాలన్న కోరిక బలంగా కలిగింది. ఇవాళ్టివరకూ కష్టాలు అనుభవించారు. భరించలేని నష్టాలు భరించారు. ఇప్పుడు వీలయినంత ఆనందాన్ని ఆశిస్తున్నారు.

మిగతా లోకమంతా తొలగిపోయింది.తెలవారుతోంది. నక్షత్రాలతోటి చీకటి నేలపైకి దిగుతోంది. పక్షులు కిలకిలా రావం, పాటతో అందెలసవ్వడి చేస్తోన్నాయి. అద్భుతం, నక్షత్రాలు ఆగి చూస్తున్నాయి! అలాంటి పల్చటి చీకటి తెర! చల్లని చిరుగాలి లోకం ఆహ్లాదం కలిగిస్తోంది. లోకం ఎంత బావుందో చూడ్డానికి యిపుడు! ‘‘మనకు కొన్ని ఆవులు, ఎద్దులు ఉంటే ఎలా ఉంటుంది? కోరుకున్నప్పుడల్లా పెరుగు, మీగడ ఉంటుంది.’’‘‘ఇలాంటి వరంతో చిన్నవాటిని కోరడమెందుకు? మనం అనుకున్నంత హాయిగా ఉండవచ్చు.’’హఠాత్తుగా బ్రాహ్మణుడి మనసులో ఓ ఆలోచన మెరిసింది. ‘‘అసలు అమ్మవారిపైనే ఓ తమాషా చేస్తే ఎలా వుంటుందంటావ్‌? ఇంటికి కావలసిన చిన్న చిన్నవాటిని ఎలాగూ ఇస్తుందనుకో. కానీ నిజంగా మనం ఎంతో ఘనమైనదే కోరితే? చేతులు జోడించి కోరుకున్నాడు, ‘‘ఓ తల్లీ, నా మాట ప్రకారం మహిమాన్వితవే అయితే, బంగారు భవంతి కావాలన్న నా కోరిక తీర్చు. అందుకు సరిపడా బంగారు వస్తుపరికరాలు అమర్చు.’’ఆ మాటలు అతని నోటనుండి వచ్చిన తక్షణమే ఓ అద్భుత బంగారు భవంతి అతని చుట్టూ వచ్చేసింది.

సరిగా నవారు లేని తుక్కి మంచం  బంగారంగా మారిపోయింది! అతను లేచి కూచున్నాడు, అమితాశ్చర్యపోయాడు, నోటమాటరాలేదు. ఆవుపేడ అలికిన బలహీనమైన గోడలు మంచి పసుపు ఛాయలోకి మారాయి. కళ్లు నులుముకుని మరీ చూశాడు. దుర్లభమయిన తన కోరిక నిజంగానే నిజమయినదా? పక్కనే అతని భార్య నిలబడింది, ఆశ్చర్యంతో నోటమాటరావడం లేదు. ఇదేమి లీల.అతని భార్య బంగారు దీపం వెలిగించింది. అతను భార్యతో అన్నాడు, ‘‘మనం అసలు నేరుగా ఈ భవంతినే కోరుకొని ఉండాల్సింది! ఉప్పు, వంటనూనె రెండింతలయ్యుండేవి, కానీ ఆమె ఇలాంటి రెండు బంగారు భవంతులు కల్పించడం చూడాలనుంది’’. దేవతకి ఈ కరుణ ఇరవయ్యేళ్ల క్రితమే కలిగి ఉంటే అతని జీవితం ఎంతో బాగుండేది. కానీ ఇపుడు వాళ్లు ఈ అద్భుత భవంతిలో ఎన్నాళ్లు సుఖంగా జీవించాలి? తన భార్యతో అన్నాడు, ‘‘నువ్వు ముసలిదానివయ్యావు. ఇలాంటి భవంతిలో ఉండే వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా, యవ్వనంతో ఉండాలి.’’‘‘నువ్వు నాకంటే ఘోరంగా వున్నావ్‌. నా గురించి ఆందోళనపడకు. నేను నీకంటే ముందే ఈ లోకాన్ని విడిచివెళ్లాలన్నదే నాకోరిక. బంగారుభవంతిని  నా కళ్లతో చూశాను, ఇంతకంటే నాకింకేమి కావాలి? ఒక్క ఆలోచన.. అమ్మవారు మనల్ని యవ్వనంలోకి తీసికెళ్లలేదా?’’‘‘అరే, నిజమే, ఎందుకు తీసికెళ్లలేదు? నా మనసుకు ఏమయింది! పోనీలే, ఆలస్యమైనా ఫరవాలేదు.

’’అతను అడిగిన మరుక్షణం వారిద్దరినీ అమ్మవారు యవ్వనవంతుల్ని చేసింది. వారి యవ్వనం తిరిగివచ్చింది. ఇలాంటి లీలను కనీసం కలలోనైనా ఎవరూ ఊహించరు. కానీ ఇద్దరూ మళ్లీ యవ్వనంలోకి వచ్చారు! రెప్పపాటు కాలంలో ఆ అద్భుత రాత్రి గడచిపోయింది.మర్నాడు తెల్లవారుతుండగానే బ్రాహ్మణుడు నిద్రలేచాడు. ‘‘ఇవాళ్టిలా సూర్యుడు ఎన్నడయినా సరికొత్తగా ఉదయిస్తాడా?’’  అతను ఆశ్చర్యపోయాడు.అతను బంగారు మెట్లు ఎక్కి బంగారు మేడ మీదకి వచ్చాడు. చుట్టూరా అంతటా బంగారు భవంతులే. లెక్కలేనన్ని సూర్యులు ఉదయించినట్టుంది. అసూయతో అతని హృదయం మండిపోయింది.  ఇతరులకు తన వల్ల ఎంతో మంచి జరుగుతుందని, ఎంతో ఆనందంగా ఉన్నారన్న ఆలోచనే అతనికి మింగుడు పడదు. ఇంత కంటే ప్రారబ్ధం ఉంటుందా?అతనో ప్రమాదకర చిట్టడవిలో ఇరుక్కున్నాడు. అతని హృదయంలో మంటలు మరింత పెరిగాయి, సూర్యుడిని సైతం కాల్చివేసేంతగా ఎదిగాయి. సహజసిద్ధమయిన  అతనిలోని జంతువులు.. నక్క, కాకి, పులి, పాము అన్నీ క్రూరంగా తిరుగుతున్నాయి. రేబిస్‌ వచ్చిన కుక్కలా అరుస్తూ గుండ్రంగా తిరుగుతూన్నాడు.‘

‘నా కళ్లలో ఒకటి గుడ్డిదే కాని! ఓ చెవి చిల్లుపడనీ!  అంతులేని లోతు బావి నా భవంతి మధ్యలో పడని!’’ అన్నాడు.ఆ మాటలు అతని నోటినుండి రాగానే అతని భార్య గట్టిగా బాధతో అరిచింది. ‘‘భగవంతుడా, ఏం జరుగుతోంది? మా అద్భుత భవనం కనుమరుగవుతుందా? ఎదుగుతున్న సూర్యుడు భూమిలోకి పడిపోతాడా?’’ఏం జరుగుతోందో అతనికి అర్థమయింది. పరుగు పరుగున బంగారు మెట్లు దిగి భార్య వద్దకి వచ్చాడు. ఆమె తన ముందున్న గోడను పట్టుకుని ముందుకు వెళ్లబోయింది. అప్పుడే వచ్చిన బ్రాహ్మణుడు ‘‘ఆగు, అక్కడే ఆగిపో! ఒక్క అడుగు ముందుకేస్తే పెద్దగొయ్యి ఉంది నీముందు!’’ అంటూ గట్టిగా అరిచాడు. కానీ ఆమెకి అతని మాట వినపడలేదు. అలా ముందుకు కదిలింది. ఆమెను పట్టుకోవడానికి  గెంతాడు. కింద ఎక్కడో పడిన శబ్దం వినపడింది. ఆమె అతన్ని వదిలిపోయింది.  ఆ తరువాత అతను ఇరవై నాలుగు కోసుల దూరం వరకూ ప్రతీ ఇల్లూ, ప్రతీ గ్రామం తిరిగాడు. అతను ఏ గ్రామానికి వెళ్లినా అతను ఒక్క కంటితోనే చూడగలుగుతున్నాడు, ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఆ బావుల్లో పడుతున్నారు.

అంతానికి ఆట్టే కాలం పట్టలేదు. అతను దయ్యంలా అరిచాడు. మృత్యువు వొడిలోకి దారి తీయించిన తన రెండు బంగారు భవంతులపట్ల ఎంతో సంతసించాడు!ఇప్పుడు తాను అన్ని బంగారు భవంతులకు ఏకైక యజమాని. కాదని ఎదిరించడానికి ఎవరూ లేరు. రోజుకో  కొత్తభవంతిలో నిద్రబోతున్నాడు. అతనికిలా రెండేసి పొందడానికి ఇపుడు ఇక ఎవరూ లేరు. అమ్మవారు అతనికి వరం ఇచ్చి ప్రయోజనమేమిటి? వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. కనుక అమ్మవారిచ్చిన వరమూ చివరికి పోయింది. ఆనందంతో ఎగిరి గంతేశాడు, చేతులు పైకెత్తి తన ఒక్క కంటితో బంగారు భవంతులను చూసుకున్నాడు. కానీ అతని అత్యంత ఆనందకర సమయాన్ని చూసేందుకే ఎవరూ లేకపోవడం చాలా దురదృష్టకరం.‘చౌబోలీ అండ్‌ అదర్‌స్టోరీస్‌’ నుంచి    
మూలం : విజయదన్‌ దెత  (రాజస్థాన్‌)
అనువాదం: టి. లలితప్రసాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top