అందాల  రాశిలా

beauty tips - Sakshi

న్యూ ఫేస్‌

రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు చర్మం రఫ్‌గా మారి, మొటిమలు, మచ్చలతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ ఫేస్‌ ప్యాక్‌. కెమికల్స్‌ నింపిన ఫేస్‌ క్రీమ్స్, లోషన్స్‌ కంటే ఇంటిపట్టున సిద్ధం చేసుకునే ఫేస్‌ ప్యాక్సే అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఆ సలహాలను పాటించి మృదువైన చర్మకాంతిని సొంతం చేసుకోండి.

కావలసినవి: 
బొప్పాయి గుజ్జు – 2 టీ స్పూన్స్, అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్‌
టమాటో జ్యూస్‌ – 2 టీ స్పూన్, ముల్తానీ మిట్టి – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్‌

తయారీ: 
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని, అందులో మెత్తగా గుజ్జులా తయారు చేసుకున్న బొప్పాయి, అరటి గుజ్జులను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో తేనె, టమాటో జ్యూస్, ముల్తానీ మిట్టి యాడ్‌ చేసుకుని బాగా కలిపి, పక్కన పెట్టుకోవాలి. తరువాత ముఖానికి ఆవిరి పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top