రాశి ఫలాలు ( 11 జనవరి నుంచి 17 జనవరి, 2015 వరకు )
చంద్రబింబం:11 జనవరి నుంచి 17 జనవరి, 2015 వరకు...
	వారఫలాలు
	మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
	ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు.
	 
	వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
	పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు.
	 
	మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
	చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. సోదరీసోదరులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు.
	 
	కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
	ఈవారం కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆస్తి విషయంలో బంధువులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. సహాయం పొందినవారే సమస్యలు సృష్టించవచ్చు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు  అనుకూలించదు. వారం ప్రారంభంలో స్వల్ప ధనలాభం.
	 
	సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
	ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో ఉద్యోగయోగం.
	 
	కన్య: (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2 పా.)
	ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల ఆదరణ పొందుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు తమ సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం.
	 
	తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
	వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. మిత్రులతో అకారణంగా విభేదాలు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు నెలకొనే అవకాశం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి నిరుత్సాహం. వారం ప్రారంభంలో వాహనయోగం.
	 
	వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
	రుణబాధలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీమాటకు ఎదురుండదు. బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూ, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం మధ్యలో కుటుంబసమస్యలు.
	 
	ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
	ఈవారం పట్టింది బంగారమే. వ్యవహారాలలో విజయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి ప్రోత్సాహకరం. వారం చివరిలో వ్యయప్రయాసలు.
	 
	మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
	చికాకులు ఎదురైనా తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులతో సఖ్యత నెలకొంటుంది.  ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు.
	 
	కుంభం: (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
	ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు మాటల వల్ల ఆప్తులు దూరమయ్యే అవకాశం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు.
	 
	మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
	పనులు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. నిర్ణయాలలో తొందరపాటువద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళారంగం వారికి చికాకులు. వారం ప్రారంభంలో ఉద్యోగలాభం.
	సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
