నా లైలా.. అలా ఉండాలి | Vodafone customers meets nagachaitanya | Sakshi
Sakshi News home page

నా లైలా.. అలా ఉండాలి

Nov 20 2014 10:32 PM | Updated on Sep 2 2017 4:49 PM

నా లైలా.. అలా ఉండాలి

నా లైలా.. అలా ఉండాలి

వొడాఫోన్ కస్టమర్లు టాలీవుడ్ హీరో నాగచైతన్యను కలసి సందడి చేశారు.

వొడాఫోన్ కస్టమర్లు టాలీవుడ్ హీరో నాగచైతన్యను కలసి సందడి చేశారు. ఒక లైలా కోసం కాలర్ ట్యూన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుల్లో లక్కీ విన్నర్స్‌కు ఈ అవకాశం లభించింది. గురువారం జరిగిన ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నాగచైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగచైతన్యను ‘సిటీప్లస్’ పలకరించింది.

..:: శిరీష చల్లపల్లి
 
నేను హైదరాబాద్‌లో పుట్టాను. పెరిగింది, చదువుకుంది మాత్రం చెన్నై, ముంబైలలో. స్కూల్‌డేస్‌లో సరదాగా డ్రమ్స్, గిటార్ ప్లే చేసేవాడిని. చిన్నప్పుడు సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. పెద్దయ్యాక మూవీ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అప్పటికీ నేను ప్రిపేర్డ్‌గా లేకపోవడంతో.. మొదట్లో నో అన్నాను. తర్వాత మంచి ప్రాజెక్ట్ వ చ్చింది కదా అని కాలిఫోర్నియాలోని యాక్టింగ్ స్కూల్ ఇన్ హాలీవుడ్ స్టూడియోస్‌లో డ్యాన్స్, ఫైటింగ్ నేర్చుకున్నాను. ‘జోష్’ మూవీతో మీ ముందుకు వచ్చాను.
 
8 ప్యాక్‌కైనా రెడీ..
నేను సినిమాల మీద ఎక్స్‌పరిమెంట్స్ చేయలేను. కానీ, కథ నాకు సెట్ అవుతుందని అనిపిస్తే కొత్త డెరైక్టర్ అయినా హ్యాపీగా వెల్‌కమ్ చెప్తాను. పెర్ఫామెన్స్ బేస్డ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను.  ప్రతి సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ని డ్రీమ్ రోల్‌గా భావిస్తాను. చాలెంజింగ్ రోల్స్ కోసం ఎంతైనా కష్టపడతాను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే 6ప్యాక్ కాదు, 8 ప్యాక్ చేయడానికి కూడా నేను రెడీ. ప్రజెంట్ సుధీర్ వర్మ డెరైక్షన్‌లో ఓ మూవీలో చేస్తున్నాను. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అదే నా ఫేవరెట్ స్పాట్..
కాలేజ్ డేస్‌లో ఇన్‌ఫాచ్యుయేషన్ నాకే కాదు అందరికీ కామనే. కానీ ఇప్పటి వరకు నేను ఎవరినీ  ఇష్టపడలేదు. ఇక నాకు రాబోయే లైలా ఎలా ఉండాలంటారా..? ఇప్పుడున్న హీరోయిన్లనందరినీ కలిపి మిక్స్ చేస్తే వచ్చే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో అలా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు జనరల్‌గా బైక్స్ అంటే భలే క్రేజ్. మార్కెట్‌లోకి వచ్చే ప్రతి బైక్‌ను ట్రై చేస్తుంటాను. ఇక ఫ్యాషన్ సంగతంటారా..! నాకు ఏదైతే కంఫర్ట్‌గా ఉంటుందో అదే ఫ్యాషన్‌ను ఫాలో అయిపోతాను. నాకు ఖాళీ దొరికినప్పుడల్లా అన్నపూర్ణ స్టూడియోస్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. హైదరాబాద్‌లో నా ఫేవరేట్ స్పాట్ కూడా అదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement