హైటెక్ రోడ్లకు వింటేజ్ షోకు | Vintage show gets more hi tech roads | Sakshi
Sakshi News home page

హైటెక్ రోడ్లకు వింటేజ్ షోకు

Sep 17 2014 3:12 AM | Updated on Sep 2 2017 1:28 PM

హైటెక్ రోడ్లకు వింటేజ్ షోకు

హైటెక్ రోడ్లకు వింటేజ్ షోకు

వింటేజ్ కార్లు హుందాతనం, ఆ కార్లలో వెళుతుంటే సంతోషం చెప్పలేనిది. అందుకేనేమో ప్రపంచ వ్యాప్తంగా హెరిటేజ్ కార్లకున్న క్రేజే వేరు. అలాంటి అందమైన కార్లు ఉన్న వారు సిటీలో ఎంతో మంది ఉన్నారు.

వింటేజ్ కార్లు హుందాతనం, ఆ కార్లలో వెళుతుంటే సంతోషం చెప్పలేనిది. అందుకేనేమో ప్రపంచ వ్యాప్తంగా హెరిటేజ్ కార్లకున్న క్రేజే వేరు. అలాంటి అందమైన కార్లు ఉన్న వారు సిటీలో ఎంతో మంది ఉన్నారు. కానీ సిటీలో అలాంటి కార్లను జాగ్రత్త చేయడానికి చోటు లేదనే చెప్పాలి. కర్ణాటకలో అయితే వింటేజ్ కార్ల కోసమని ప్రత్యేక మ్యూజియమే ఉంది. అలాంటి ఏర్పాట్లే ఇక్కడ కూడా చేస్తే అపురూపమైన కార్లను కాపాడుకోవచ్చనేది క్లబ్ సభ్యుల మాట.
 
 బ్యూక్, రోల్స్ రాయిస్, లసాల్, 1915 వోల్స్‌లే, 1936 క్యాడిలాక్, 1953 ఆస్టిన్ సోమర్‌సెట్... ఈ తరంవారికి ఈ పేర్లు కాస్త కొత్తగానే ఉంటాయి. ఇవన్నీ అలనాటి మేటి కార్ మోడల్స్. అపురూపమైన ఈ కార్లను ప్రస్తుత తరానికి పరిచయం చేస్తూ... వింటేజ్ ర్యాలీలు నిర్వహిస్తూ... నాటి జ్ఞాపకాలను కళ్లముందు కదలాడిస్తోంది‘హెరిటేజ్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’.
 
 ఇనుప సామాన్ల వాడికి వేయడానకి రెడీగా ఉన్నట్లు కనిపించే కార్లను, పెళ్లి కూతురులా ముస్తాబు చేయగలగడం డాక్టర్ వెంకట్రావ్ ప్రత్యేకత. రెండు దశాబ్దాలకు పైగా ఈ పనిలో ఈయన నిమగ్నమైపోయారు. 20కి పైగా పాత కార్లకు కొత్త సొగసులు అద్దారు. తనలా అభిరుచి, ఆసక్తి ఉన్న మరో నలుగురితో కలిసి 2006లో హెరిటేజ్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రారంభించారు.
 
 ఆ పాత అమూల్యం
 ‘కాలేజీ రోజుల్లో నాది వింటేజ్ బైక్. 1961 మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్. అప్పటి నుంచే పాత మోటారు వాహనాలపై ఆసక్తి మొదలైంది. ఆడవాళ్లకి నగలు ఎలా అపురూపమైనవో మాకు ఈ పాత కార్లు అంత ప్రత్యేకమైనవి. వందల ఏళ్లుగా ఉన్నవి, స్క్రాప్‌గా వచ్చిన కార్ల స్పేర్ పార్ట్స్ అంత సులభంగా దొరకవు. ఒక్కో పార్టు పట్టుకోవడానికి ఇనుప సామాన్ల షాపులతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలకు, ఒక్కోసారి విదేశాలు తిరగాల్సి వస్తుంది. వంద ఏళ్ల పూర్వం కారైనా, రిపేరు చేసి రోడ్డు మీద నడపవచ్చు. ఇప్పటి కార్లు.. డిస్పోజబుల్. అదే 1948 స్క్రాప్‌గా పడి ఉన్న కారు రూ.10 లక్షలు విలువ చేస్తుంది. దాన్ని రీ మోడల్ చేసి విక్రయిస్తే రూ.30 లక్షల వరకూ ధర పలుకుతుంది’ అంటారు వెంకట్రావ్.
 
 నాటి నుంచే ప్రదర్శనలు
 క్లబ్ ప్రారంభించక ముందు నుంచే పాత కార్ల ప్రదర్శనలు చేసే వాళ్లం. క్రమంగా యాక్టివిటీస్ పెరగగానే...వాటికి ఓ స్ట్రక్చర్ కూడా ఇస్తే బాగుంటుందని 2006లో క్లబ్ ప్రారంభించాం. అప్పుడే సికింద్రబాద్ 200 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వం అందులో ర్యాలీ నిర్వహించమనటంతో పూర్తి స్థాయిలో ఈవెంట్లు మొదలు పెట్టాం. అలా టైమ్స్ ఆటో వింటేజ్ కార్ ర్యాలీ, సౌత్ సెంట్రల్ రైల్వే రూబీ జూబ్లీ వింటేజ్ కార్ ర్యాలీ, జీఎంఆర్ వింటేజ్ కార్ ర్యాలీ అండ్ ఎగ్జిబిషన్, హేగ్ వింటేజ్ కార్ ర్యాలీ, వింటేజ్ కార్ ఫీస్టా, ది వింటేజ్ కార్ డ్రైవ్ అండ్ షోకేస్ వంటివెన్నో ఈవెంట్లు నిర్వహించారు. ఇందిరాగాంధీ, నెహ్రూలను తిప్పిన క్యాడిలాక్ కారు కూడా ప్రదర్శించాం. అదే కార్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో అప్పటి సీఎం రోశయ్య ఇదే కార్లో ఎక్కి ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు’ అని క్లబ్ ఫౌండర్ మహేష్ సి రామన్ చెప్పుకొచ్చారు.
 
 నేపథ్యాలు వేరైనా...
 క్లబ్‌లో ఐదుగురు సభ్యులు. వారి నేపథ్యాలు వేరైనా పాతకార్లపై వారికున్న ఆసక్తి మాత్రం ఒక్కటే. ఎ.వెంకట్రావ్ జనరల్ ఫిజీషియన్. మహేష్ పారిశ్రామికవేత్త. ఎస్‌ఏ మొహమ్మద్, ఇందర్ కృష్ణమ్మ బిల్డర్లు. భరత్ సీఏ. వీరందరికీ పాతకార్లంటే ప్యాషన్. వాటిని నడపడమంటే ఇంకా మోజు. నగర వాసులకి వింటేజ్ కార్లను పరిచయాలనుకునే వాళ్లు ఈ క్లబ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 9848003700, 9885111144 నంబర్లలో సంప్రదించవచ్చు.
 -  ఓ మధు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement