ఈ ఆహారంతో అకాల మరణానికి చెక్‌

Plant-Based Fats Could Extend Your Life - Sakshi

లండన్‌ : అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌ వంటి మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలు, కొవ్వుల ద్వారా అకాల మృత్యువాతన పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా  కొవ్వులతో కూడిన ఆహారం తీసుకునే వారికి ఈ పోషకాలు లభించని ఆహారం తీసుకునే వారితో పోల్చితే అకాల మరణం ముప్పు 16 శాతం తక్కువగా ఉంటుందని అథ్యయనం తేల్చింది.

ప్రజలు తీసుకునే కొవ్వు పదార్థాల రకాలను బట్టి వారి జీవితకాలం ఎలా ఉంటుందనేది 22 ఏళ్ల పాటు జరిపిన ఈ పరిశోధన విశ్లేషించింది. 93,000 మంది పురుషులు, మహిళల నుంచి సేకురించిన గణాంకాల ఆధారంగా ఈ పరిశోధన చేపట్టారు. ప్రతి నాలుగేళ్లకోసారి వీరి ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా సమీకరించి విశ్లేషించారు. వీరిలో మాంసం, గుడ్లు, పూర్తికొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకునే వారిని ఓ గ్రూపుగా, అవకాడోలు, నట్స్‌,ఆలివ్‌ ఆయిల్‌ వంటి మొక్కల ఆధారిత నూనెలు, కొవ్వులు తీసుకునే వారిని ఓ గ్రూపుగా విభజించి సమాచారాన్ని విశ్లేషించారు.

ప్లాంట్‌ బేస్డ్‌ కొవ్వులు తీసుకున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ పరిశోధన తేల్చింది. ఈ తరహా ఆహారంతో 25 శాతం మేర జీవనకాలాన్ని పెంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ రెండింటి మధ్య పోషకాల పరంగా ఎలాంటి వైరుధ్యాలున్నదీ వెల్లడిస్తూ వారు సాపేక్ష వివరాలు పేర్కొనలేదు. 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top