ఐడియాతో రండి.. షార్ట్‌ఫిల్మ్‌తో వెళ్లండి | One idea can be designed as a mega short film | Sakshi
Sakshi News home page

ఐడియాతో రండి.. షార్ట్‌ఫిల్మ్‌తో వెళ్లండి

Aug 11 2014 4:24 AM | Updated on Sep 2 2017 11:41 AM

ఐడియాతో రండి.. షార్ట్‌ఫిల్మ్‌తో వెళ్లండి

ఐడియాతో రండి.. షార్ట్‌ఫిల్మ్‌తో వెళ్లండి

ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా మా వెబ్‌సైట్‌కి ఐడియాతో వస్తే షార్ట్‌ఫిల్మ్‌తో బయటకు వెళ్తారు. బుల్లి సినిమాలకు వన్ డోర్ సొల్యూషన్ ఇవ్వాలని స్టార్ట్ చేశాను.

ఐడియా ఉంటే చాలు షార్ట్ ఫిల్మ్ తీసేయొచ్చు. బుల్లి సినిమా తీసే క్రమంలో ఏ సహకారం, సమాచారం కావాలన్నా
ఇట్టే అందిస్తోంది ఓ వెబ్‌సైట్ www.shortfilmsintelugu.in తెలుగులో షార్ట్ ఫిలింస్ తీస్తున్నవారు చాలా మందే ఉన్నారు.
వారి కోసమే ఒక ఎక్స్‌క్లూజివ్ వెబ్‌సైట్ రూపొందించారు. విజయ్.కె.అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆ వివరాలేంటో ఆయన మాటల్లో...

 
 ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా మా వెబ్‌సైట్‌కి ఐడియాతో వస్తే షార్ట్‌ఫిల్మ్‌తో బయటకు వెళ్తారు. బుల్లి సినిమాలకు వన్ డోర్ సొల్యూషన్ ఇవ్వాలని స్టార్ట్ చేశాను. మా వెబ్‌సైట్ ఓన్లీ తెలుగు షార్ట్‌ఫిల్మ్‌స్ గురించి మాత్రమే. మొదట్లో షార్ట్‌ఫిల్మ్‌స్‌కి చిన్న, చిన్న రివ్యూస్ రాసేవాడిని. నా కామెంట్స్‌కి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ క్రమంలో నటన, దర్శకత్వం వంటి వాటిపై దరఖాస్తులను ఆహ్వానిస్తే వారంలోనే 100 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు రోజుకు 300, 400 మంది అప్రోచ్ అవుతున్నారు. అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నాం. సినిమా ఎందుకు తియ్యాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుంటాను.

సినిమాలను కెరీర్‌గా చేసుకోవాలంటే గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకోవాలని గైడ్ చేస్తుంటాను. ఎవరైనా స్టోరీ, కాన్సెప్ట్‌తో వస్తే అతని ఆ కలని రియాలిటీలోకి తీసుకువస్తాం. షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో మూడు స్టెప్స్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటాయి. వీటితోపాటు ప్లానింగ్‌లో కూడా హెల్ప్ చేస్తాం. ఏ స్టేజ్‌లో ఉన్నా చెక్ లిస్ట్ ద్వారా సహకరిస్తాం. ఇంకా ఇండివిడ్యువల్‌గా వెబ్‌సైట్లో షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన అన్ని కేటగిరీస్ ఉన్నాయి. వాటిల్లో ఫారం ఫిల్ చేసి మాకుడిటెయిల్స్ పంపిస్తారు. దానికి లింక్ తయారు చేస్తాం. ఆ డేటా ద్వారా ఫిలిం మేకర్స్ అడిగినప్పుడు వారిని సజెస్ట్ చేస్తాం.
 
  షార్ట్ ఫిలింస్‌లో హద్దులు మీరే సన్నివేషాలుండవనే అమ్మాయిలూ నటనపట్ల ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. స్క్రిప్ట్‌ను ఓకే చేసిన తర్వాత  మేకర్స్‌కి వీళ్ల డిటెయిల్స్ పంపిస్తాం. కాలేజీ, లవ్వు, అమ్మాయి, బ్రేక్‌అప్ వీటి గురించి తీస్తున్నారు. నిజ జీవితకథలను తెరకెక్కించడమే ధ్యేయం. మా సర్వీసుకు ఎటువంటి చార్జెస్ లేపు. ఉచితంగా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వి మేక్ కనెక్షన్స్... షార్ట్‌ఫిల్మ్‌స్‌కి ఏం కావలసినా మా వెబ్‌సైట్ పేరు వినిపించాలనేది గోల్.  షార్ట్‌ఫిల్మ్ డెరైక్టర్స్‌లో నుంచిఒక్కరైనా టాలీవుడ్ సినిమా తియ్యాలని నా ఆశ.
 - మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement