న్యూ... డేటింగ్! | New ... dating! | Sakshi
Sakshi News home page

న్యూ... డేటింగ్!

Dec 6 2014 12:32 AM | Updated on Sep 2 2017 5:41 PM

శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్‌

శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్‌

బాలీవుడ్ తారలకు సినిమాలున్నా లేకపోయినా డేటింగ్ కామనైపోయింది. ఇప్పటికే... కనిపించీ కనిపించకుండా...

బాలీవుడ్ తారలకు సినిమాలున్నా లేకపోయినా డేటింగ్ కామనైపోయింది. ఇప్పటికే... కనిపించీ కనిపించకుండా... వినిపించీ వినిపించకుండా... డేటింగ్ చేస్తున్న కత్రినా- రణబీర్‌ల మధ్య అసలేదన్నా విషయం ఉందో లేదో తెలియక అభిమానులకు నిద్దర పట్టడం లేదు. ఈలోగా మరో రిలేషన్ ‘తెర’పైకి వచ్చింది. శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్‌ల మధ్య ఏదో జరిగిపోతున్నట్టు సమాచారం.

ఇద్దరూ కలసి ఒకే సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పడు మొదలైన స్నేహం.. సాన్నిహిత్యంగా మారి.. సహజీవనం దిశగా సాగుతుందని బీ-టౌన్ టాక్. తన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ కశ్మీర్‌లో ఉన్న ఆదిత్యను కలవడానికి వెళ్లిందట శ్రద్ధా. కానీ... తమది స్నేహం తప్ప మరేదీ కాదంటున్నారు వీరు.  
 

Advertisement
 
Advertisement
Advertisement