టేస్ట్... భల్లే భల్లే | fabulous panjabi tastes | Sakshi
Sakshi News home page

టేస్ట్... భల్లే భల్లే

Apr 3 2015 11:31 PM | Updated on Sep 2 2017 11:48 PM

టేస్ట్...  భల్లే భల్లే

టేస్ట్... భల్లే భల్లే

పంజాబీ రుచులు నోరూరిస్తున్నాయి.

పంజాబీ రుచులు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని రాయల్ రివే హోటల్ లజీజ్ రెస్టారెంట్‌లో ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌లో సర్సన్ కా సాగ్ అండ్ మక్కీ ది రోటీ, తందూరి కుక్కడ్, పిండీ చోలే, కడీ పకోడి, పన్నీర్ మఖనీ, ఇమ్మర్తీ, ఫిర్నీ, కేసర్ కుల్ఫీ, బటర్ చికెన్, ఆలూ ద ప్రంత, రాజ్మా చావల్ ఘుమఘుమలాడుతున్నాయి. ప్రతిరోజూ లంచ్, డిన్నర్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ వడ్డిస్తున్నారు. 200 రక్చా ఫుడ్ వెరైటీస్ ఇక్కడ రుచి చూడవచ్చు. ‘రెస్టారెంట్ దాబాలాగా ఉంటుంది. పానీపూరీ బండి స్పెషల్ అట్రాక్షన్. వెళ్లగానే లుంగీ, కుర్తా, షూష్, కలర్‌ఫుల్ పంజాబీ డ్రెస్సు ధరించిన వెయిటర్స్ స్వాగతం పలుకుతారు.

దాబాలోలా నులక మంచంపై కూర్చుని ఆరగించవచ్చు. ఈ వంటకాల్లో ఉపయోగించే మసాలాలన్నీ అమృత్‌సర్ నుంచి తెప్పిస్తున్నామని హోటల్ జీఎం సంజయ్ చెప్పారు. చెఫ్‌లు కూడా అక్కడి వారేనన్నారు. ‘సర్సన్ కా సాగ్ అండ్ మక్కీ ది రోటీ పంజాబీల డిష్‌లో ప్రధానమైనది. ఐరన్, ప్రొటీన్‌లు అత్యధికంగా ఉండే ఈ డిష్‌ను వారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక బటర్ చికెన్ టేస్టే వేరు. రాజ్మా చావల్  మరో స్పెషల్ అట్రాక్షన్. ఇందులోనూ ఐరన్, ప్రొటీన్లు, కార్బో హైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే పంజాబీ ఫుడ్ ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది’ అంటారాయన. ఈ ఫె్‌స్ట్ ఈ నెల 14 వరకు కొనసాగుతుందన్నారు.
  సాక్షి, సిటీప్లస్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement