అదృశ్య శక్తుల విధ్వంసం

youtube hits in this week

ఈ వారం యూట్యూబ్  హిట్స్‌

హ్యారీ పాప్‌కార్న్‌ చోరీ
స్నీకీ టాడ్లర్‌ స్టీల్స్‌ ప్రిన్స్‌ హ్యారీస్‌ పాప్‌కార్న్‌
నిడివి: 1 ని.
హిట్స్‌: 1,34,95,392

పిల్లలు స్నీకీగా భలే ముద్దు ముద్దు పనులు చేసేస్తుంటారు. స్నీకీగా అంటే.. దొంగచాటుగా! దొంగచాటు అని మనం అనుకుంటాం కానీ, నిజానికి వాళ్లు ఏ పనైనా దర్జాగానే చేసేస్తారు. ఈ వీడియోలో బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ చేతిలో ఉన్న పాప్‌కార్న్‌ బకెట్‌లోంచి ఓ చిన్నారి.. పాప్‌కార్న్‌ని ఎలా లాగేస్తోందో మీరు చూసి తీరాల్సిందే. ‘ఇదిగో కాస్త పట్టుకుని కూర్చోవయ్యా’ అని, తన పాప్‌కార్న్‌ బకెట్‌నే ప్రిన్స్‌ చేతిలో పెట్టి, అందులోంచి తడవకు ఇంత తీసుకుంటున్నంత స్వతంత్రంగా ఆ పాప పాప్‌కార్న్‌ని లాగించేస్తోంది. రెండు మూడు ‘టేక్‌ అవే’ల తర్వాత ప్రిన్స్‌ గమనించి, ‘దిస్‌ ఈజ్‌ మైన్‌’ అని సరదాగా చేతిని వెనక్కు లాక్కున్నారు. వెంటనే మళ్లీ, తినమని ఆ చిన్నారికి చిన్న పీస్‌ ఆఫర్‌ చేశాడు. సెప్టెంబర్‌ 30న టొరంటో (కెనడా) స్టేడియంలో క్యాచ్‌ చేసిన ఈ స్నీకీ మోమెంట్‌ను ‘ది రాయల్‌ ఫ్యామిలీ ఛానెల్‌’ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. ‘ఇన్విక్టస్‌’ గేమ్స్‌ చివరి రోజు అది. ప్రిన్స్‌ హ్యారీ గ్యాలరీలో కూర్చొని ఆటల్ని చూస్తున్నారు. పక్కనే ఒక నస మేళం ఏదో చెబుతుంటే ‘ఊ’ కొడుతూ, పాప్‌కార్న్‌ని కరకరలాడిస్తూ స్టేడియంలోకి చూస్తున్నాడు. ప్రిన్స్‌కి ఇటువైపు ఆయన కుటుంబ స్నేహితురాలి ఒడిలోని పాపాయే మనం ఇంతవరకు మాట్లాడుకున్న స్నీకీ క్వీన్‌. ఆ చిన్నారి రెండు మూడు దఫాలుగా పాప్‌కార్న్‌ గుప్పెట పట్టేయడం.. యూట్యూబ్‌ వీక్షకుల్ని ఇప్పుడు పకపకలాడిస్తోంది. ‘ఇన్విక్టస్‌’ గేమ్స్‌ పారాలింపిక్స్‌ స్టెయిల్‌లో ఉంటాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ క్రీడాకారుల కోసం కోసం రాజప్రాసాదం 2014లో వీటిని ప్రారంభించింది. ఇన్విక్టస్‌ అనేది లాటిన్‌ మాట. 19వ శతాబ్దాంతపు ఆంగ్ల రచయిత విలియమ్‌ ఎర్నెస్ట్‌ హెన్లీ రాసిన ‘ఇన్విక్టస్‌’ కవిత నుంచి ఈ పదాన్ని తీసుకున్నారు. ఈ లాటిన్‌ మాటకు ‘జయించలేనిది’ అని అర్థం. ‘నా తల బద్దౖలñ  రక్తం కారుతున్నా, నేను తలవాల్చను’ అంటాడు ఆ కవితలోని కథానాయకుడు.

అదృశ్య శక్తుల విధ్వంసం
ఎనాయిలేషన్‌ టీజర్‌ ట్రైలర్‌
నిడివి: 1 ని. 46 సె.
హిట్స్‌: 53,37,914

నేటలీ బయాలజిస్టు. జెన్నిఫర్‌ సైకాలజిస్ట్‌. జీనా ఆంత్రోపాలజిస్టు. టెస్సా సర్వేయర్‌. త్యువా నవోతీ లిగ్విస్టు. ఈ ఐదుగురు మహిళలూ ఒక టాస్క్‌పై బయల్దేరుతారు. ఒక భయంకరమైన ఎక్స్‌ జోన్‌లోకి ప్రవేశిస్తారు. అది ఈ భూగోళాన్ని నాశనం చేసే జోన్‌. విధ్వంసం (ఎనాయిలేషన్‌) సృష్టించే జోన్‌. అక్కడ వీళ్లు ఒకళ్లనొకళ్లని కాపాడుకుంటూ టాస్క్‌ పూర్తి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్లకు ముందు 11 బృందాలు ఈ జోన్‌లోకి వెళ్లి రహస్యాలను ఛేదించే సాహసాలను చేస్తాయి. ఆ బృందాలలో కొందరు అకస్మాత్తుగా మాయమైపోతారు. కొందరికి పిచ్చి పడుతుంది. కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ పన్నెండో టీమ్‌లోని నేటలీ.. అదృశ్యమైన తన భర్త జాడల్ని కనిపెట్టడానికి టీమ్‌లో చేరుతుంది. టీజర్‌లో ఒళ్లు గగొర్పొడిచే అమానవీయ ఆకృతులు, వికృత ఆకారాలు, ఏ జాతివో తెలియని జంతువులు కనిపిస్తాయి. ఊడలు దిగిన చెట్ల వంటి మనుషులు ఉంటారు. వాళ్లతో వీళ్ల పోరాటం. 2018 ఫిబ్రవరి 23న పిక్చర్‌ రిలీజ్‌. 49 ఏళ్ల అమెరికన్‌ రచయిత జెఫ్‌ వాండర్‌ మీర్‌ 2014లో రాసిన ‘ఎనాయిలేషన్‌’ నవల ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ హాలీవుడ్‌ మూవీ.. టీజర్‌ని బట్టి చూస్తే పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా ఉంది.

స్వర్గలోకపు స్వీట్‌ లుక్‌
మైనే తుర్‌కో దేఖా
గోల్‌మాల్‌ అగైన్‌
నిడివి: 2 ని. 42 సె.
హిట్స్‌: 54,26,605

మళ్లీ ఓ ‘గోల్‌మాల్‌’ మూవీ వస్తోంది! అందులోని సాంగే ఈ.. ‘మైనే తుర్‌nుకో దేఖా’. నేను నిన్ను చూశానంటాడు అజయ్‌ దేవగణ్‌. పరిణీతి ఓ స్వీట్‌ లుక్‌ ఇస్తుంది. ‘.. నేను నా హృదయాన్ని నీ వైపు పారేసుకున్నాను. నువ్వు స్వర్గలోకపు కన్యవు. ఆ సంగతిని నా కళ్లు చెబుతున్నాయి..’ అని పాటను కంటిన్యూ చేస్తాడు. ఆ పాటే ఈ వీడియో సాంగ్‌. పిక్చరైజేషన్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. తేయాకు తోటల మధ్య సాగే ఈ గుంపు పాటలో అంతా నేలపై డాన్స్‌ చేస్తున్న రంగురంగుల గాలిపటాల్లా ఉంటారు. తర్వాత ఈ గుంపు ఓపెన్‌ టాప్‌ బోగీలలో ఊరేగుతుంది. ‘గోల్‌మాల్‌ అగైన్‌’ చిత్రంలోని ఈ పాటకి యూత్‌ బాగా కనెక్ట్‌ అయినట్లే కనిపిస్తోంది, హిట్‌లను లెక్కేస్తుంటే! మొదటి మూడు గోల్‌మాల్‌ చిత్రాల సిరీస్‌ను డైరెక్ట్‌ చేసిన రోహిత్‌ శెట్టీనే దీనిని తీస్తున్నారు. ఫస్ట్‌ పిక్చర్‌ ‘గోల్‌మాల్‌: అన్‌లిమిటెడ్‌’ 2006లో వచ్చింది. తర్వాత 2008లో సెకండ్‌ మూవీ ‘గోల్‌మాల్‌ రిటర్న్‌’ రిలీజ్‌ అయింది. ‘గోల్‌మాల్‌ 3’ ని 2010లో తీశారు. ఫోర్త్‌ మూవీ.. ఈ అక్టోబర్‌ 20 న విడుదల కాబోతున్న ‘గోల్‌మాల్‌ అగైన్‌’. నిజానికి దీనిని 2013లోనే తీసుకురావాలనుకున్నారు. హీరోయిన్‌ను వెతకడంతోనే సరిపోయింది. చివరికి పరిణీతి ఫిక్స్‌ అయ్యారు. ఈ కామెడీ సీరీస్‌ అన్నింటిలోనూ అజయ్‌ దేవగణే హీరో! ఫ్రెండ్స్‌తో కలిసి ఓపెన్‌ ఎయిర్‌ గార్డెన్‌ పార్టీ చేసుకోవాలనుకుంటున్నవాళ్లకు మంచి థాట్‌ తెప్పించే సీన్‌ ఒకటి ఈ వీడియో చివర్లో ఉంది.

ఎక్కడికైనా గంట లోపే!
బి.ఎఫ్‌.ఆర్‌. ఎర్త్‌ టు ఎర్త్‌
నిడివి: 1 ని. 57 సె.
హిట్స్‌: 21,88,162

న్యూయార్క్‌. ఉదయం 6 గం. 30 ని.  ప్రయాణికులు ఒకరొకరుగా హడ్సన్‌ నది ఒడ్డున ఉన్న రాకెట్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు పికప్‌ లాంచీకి చేరుకుంటున్నారు. రాకెట్‌ స్టేషన్‌ నుంచి వాళ్లంతా చైనాలోని షాంఘై వెళ్లాలి. అరగంటలో రాకెట్‌ బయల్దేరుతుంది. న్యూయార్క్‌కి, షాంఘైకి మధ్య దూరం 11,879 కి.మీ. ప్రయాణ సమయం 39 నిముషాలు! రాకెట్‌ కదా మరి. సరే.. ఈ పికప్‌ లాంచీ.. ప్రయాణికులను రాకెట్‌ స్టేషన్‌ దగ్గరకు తీసుకొచ్చింది. వాళ్లంతా రాకెట్‌లోకి ఎక్కి కూర్చున్నారు. రాకెట్‌ పైకి లేచింది. నింగిలోకి ఎగిసింది. భూవాతావరణాన్ని దాటి రయ్యిన దూసుకెళ్లింది. ఆ తర్వాత గమ్యస్థానం చేరుకోగానే నిట్టనిలువుగా షాంఘై రాకెట్‌ స్టేషన్‌లో దిగింది. వావ్‌!! అయితే ఈ అత్యద్భుతమైన, మహా వేగవంతమైన ప్రయాణ సౌకర్యానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కొంత అంటే ఓ ఏడాది. ‘స్పేస్‌ ఎక్స్‌’ అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఎర్త్‌ టు ఎర్త్‌ మానవయాన రాకెట్‌లను తయారుచేస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే.. భూమి మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోపే చేరుకోవచ్చు. ఢిల్లీ టు న్యూయార్క్‌ అయితే అరగంటే. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఐడియా కోసం స్పేస్‌ ఎక్స్‌.. శాంపిల్‌గా ఈ వీడియోను యూట్యూబ్‌లోకి టేక్‌ ఆఫ్‌ చేసింది. అన్నట్లు బి.ఎఫ్‌.ఆర్‌. అంటే బిగ్‌ ఫాల్కాన్‌ రాకెట్‌. దీని పీక్‌ కెపాసిటీ గంటకు 28 వేల కి.మీ.!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top