గ్రామదేవతా నామ విశేషాలు | Village goddess information | Sakshi
Sakshi News home page

గ్రామదేవతా నామ విశేషాలు

Dec 10 2017 1:23 AM | Updated on Dec 10 2017 1:23 AM

Village goddess information - Sakshi

  ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమంగా ‘తలుపులమ్మ’గా మారింది.
 పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.
 సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. ‘మా వూళ్ళన్నింటికీ అమ్మ‘ అనే అర్థంలో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమంగా అది ‘మావుళ్ళమ్మ‘ అయింది.
 స్వచ్ఛమెన అమ్మ అనే అర్థంలో అచ్చ(స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.
  ప్రతి వ్యక్తికీ ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట(అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది.
  అలాగే ఫుల్ల(వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ. చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement