తద్దినాలు పెడుతున్నా... మహాలయ పక్షాలు పెట్టాలా?

పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? అదేవిధంగా మన కుటుంబాలలో పెళ్లికాని తోబుట్టువులు లేదా పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి.

పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం చేస్తారు. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం సంక్రమిస్తుంది. అలాగే ఏ కారణం  చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది.

ఎప్పుడు, ఎలా ..?
తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’ నాడు పెట్టడం ప్రశస్తం. మరణించిన బంధువులందరికీ, తిథులతో సంబంధం లేకుండా ఈ రోజునే ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, దర్భలతో చేసిన పవిత్రమనే ఉంగరాన్ని ధరించి, ్రÔè ద్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఇవి ఏవీ చేతకాకపోతే, కనీసం మృతులను తలచుకుని వారి పేరిట అన్నదానం చేసినా కూడా ఫలప్రదమేనంటారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top