ప్రాణవాయువుతోనే వ్యాధులకు చికిత్స!!

Treatment of oxygenated diseases - Sakshi

బతికేందుకు మనం పీల్చుకునే ఆక్సిజన్‌తోనే వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు చికిత్స కల్పిస్తే ఎలా ఉంటుంది? యాంటీబయాటిక్‌ మందులను పూర్తిగా మాన్పించే లక్ష్యంతో సిన్‌సినాటీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్నమైన ఆలోచన చేశారు. కాంతి ద్వారా ఉత్తేజితం చేస్తే.. ఆక్సిజన్‌ కాస్తా శక్తిమంతమైన ఆయుధంగా మారుతుందని, మందులకు లొంగని బ్యాక్టీరియాతోపాటు అనేక ఇతర సూక్ష్మజీవి సంబంధిత ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు పనికొస్తుందని వీరు అంటున్నారు. ఈ కొత్త ఆయుధంతో భవిష్యత్తులో కేన్సర్‌ కణాలకూ చెక్‌ పెట్టవచ్చునన్నది వీరి అంచనా. ఫొటో సెన్సిటైజర్లను వాడినప్పుడు సాధారణ ఆక్సిజన్‌ కాస్తా రియాక్టివ్‌ ఆక్సిజన్‌గా మారుతుందని, బ్యాక్టీరియాపై దాడి చేస్తుందని, ప్రస్తుతం ఈ పద్ధతిని తాము ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పెంగ్‌ ఝాంగ్‌ తెలిపారు.

ద్రవపదార్థాల్లో ఉండే బ్యాక్టీరియానూ చంపేసేందుకు తాము కొన్ని లోహాల నానో కణాలను ఉపయోగించామని, ఇది పలు రకాల బ్యాక్టీరియాను నాశనం చేయడంలో విజయం సాధించిందని వివరించారు. ఈ ఫొటో సెన్సిటైర్లను స్ప్రే లేదా జెల్‌ రూపంలోకి మార్చేందుకు తాము పేటెంట్‌ కూడా సంపాదించామని, దీన్ని నేరుగా గాయాలపై వేసేందుకు అవకాశముందని, మానవ చర్మంపై జరిపిన పరిశోధనల్లో ఈ స్ప్రే చర్మకణాలను కాకుండా బ్యాక్టీరియాను మాత్రమే చంపేసిందని వివరించారు. భవిష్యత్తులో చర్మ కేన్సర్‌కూ దీన్ని వాడవచ్చునని సూచించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top