కురులకు పోషకాలు... | To receive nutrients ... | Sakshi
Sakshi News home page

కురులకు పోషకాలు...

Jun 28 2016 10:35 PM | Updated on Sep 4 2017 3:38 AM

పోషకాహారం మేనికి ఆరోగ్యాన్నికి ఇస్తుంది. అలాగే ఇంట్లో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బ్యూటిప్స్

 

పోషకాహారం మేనికి ఆరోగ్యాన్నికి ఇస్తుంది. అలాగే ఇంట్లో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల కొబ్బరిపాలు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి నానబెట్టాలి. తర్వాత మెత్తని పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, అర గంట తర్వాత షాంపూతో తలంటుకోవాలి.


ఇలా ప్రతి 15 రోజులకోసారి చేస్తూ ఉంటే వెంట్రుకలకు మృదుత్వంతో పాటు, సహజసిద్ధమైన రంగు వస్తుంది.బంగాళదుంప పొట్టు తీసి, సన్నటి ముక్కలుగా కట్ చేయాలి. గుజ్జుగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. విటమిన్ ఎ, బి, సి పోషకాలు జుట్టు కుదుళ్లకు అంది వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement