ముందు పళ్లు మూడూ విరిగిపోయాయి..? | Three broken front teeth ..? | Sakshi
Sakshi News home page

ముందు పళ్లు మూడూ విరిగిపోయాయి..?

Jan 11 2014 12:30 AM | Updated on Sep 2 2017 2:29 AM

ముందు పళ్లు మూడూ విరిగిపోయాయి..?

ముందు పళ్లు మూడూ విరిగిపోయాయి..?

ఈమధ్య కాలంలో యాక్సిడెంట్ల వల్ల, ఆటలలో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణమైపోయింది.

మా అబ్బాయి వయసు 18. స్నేహితులతో క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ముందు మూడు పళ్లూ పూర్తిగా ఊడిపోయాయి. కిందిపళ్లు రెండు సగానికి పైగా విరిగిపోయాయి. రెండు రోజుల తర్వాత డాక్టర్‌ను కలిస్తే పక్క పళ్ల సపోర్ట్‌తో ఫిక్స్‌డ్ పళ్లు అమరుస్తానని అన్నారు. ఇంత చిన్న వయసులో కృత్రిమ దంతాలు అంటేనే భయంగా ఉంది. జీవితకాలం వీటితో గడపడం సాధ్యమేనంటారా?
 - హేమలత, సికిందరాబాద్


ఈమధ్య కాలంలో యాక్సిడెంట్ల వల్ల, ఆటలలో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాలలో పళ్లు విరగడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. పళ్లు కొద్దిగా విరిగినా, సగానికి చిట్లిపోయినా పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కేవలం ఒకటి రెండు సిట్టింగుల్లో లామినేట్స్ ద్వారాగాని, క్రౌన్స్ ద్వారాగాని ఎంతో అందంగా, మునుపటి పంటి సైజ్, షేప్‌లో సహజంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఇవి మిగిలిన పంటి రంగులో కలిసిపోతాయి. కృత్రిమమని ఎవరూ గుర్తించే అవకాశం లేదు. మంచి ల్యాబరేటరీలు అందుబాటులో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటే పూర్తిగా మీ సమస్యలు దూరమవుతాయి. ఇందుకు ఆధునిక టెక్నాలజీ ఎంతగానో సహకరిస్తోంది.
 
గుర్తుంచుకోవాల్సినదేమిటంటే...
 
పళ్లు పూర్తిగా ఊడిపోతే ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి. ఊడి, కిందపడిన పళ్లను జాగ్రత్తగా సేకరించి చల్లటి నీటిలోగాని, పాలలో గాని భద్రపరచి, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువస్తే వాటినే ఊడిన స్థానంలో అమర్చవచ్చు. అవి తిరిగి అతుక్కుపోతాయి. అప్పుడప్పుడూ చెకప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ... మీ బాబు విషయంలో ఊడిన పళ్లు లేవు కాబట్టి తప్పనిసరిగా కృత్రిమ దంతాలపై ఆధారపడాల్సిందే.

అయితే కృత్రిమ దంతాల అమరికపై ఎటువంటి భయాందోళనలు వద్దు. ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పోయిన పళ్ల స్థానంలో పక్కపళ్లను అరగదీయ నవసరం లేకుండా, వాటి సపోర్ట్‌తో పనిలేకుండా ఎముకలోకి చిన్న స్క్రూలను అమర్చి వాటి సాయంతో ఎంతో సహజంగా కృత్రిమ దంతాలను అమర్చవచ్చు.  వీటితో మామూలు పళ్లలాగే కొరకవచ్చు, నమిలితినవచ్చు. ఒకప్పుడయితే ఈ చికిత్స ఖరీదైనదైనే అభిప్రాయం ఉండేది. కానీ... ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఎటువంటి ఆందోళనా వద్దు.
 
 డాక్టర్ పార్థసారథి
 కాస్మటిక్ డెంటల్ సర్జన్,  పార్థా డెంటల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement