భారతీయుల దంతాలు బాగుంటాయ్‌..! | German Man Says Indians Have Good Dental Hygiene Goes Viral | Sakshi
Sakshi News home page

భారతీయుల దంతాలు బాగుంటాయ్‌..! జర్మన్‌ వ్యక్తి ప్రశంసల జల్లు

May 28 2025 12:11 PM | Updated on May 28 2025 4:53 PM

German Man Says Indians Have Good Dental Hygiene Goes Viral

ఇంతవరకు భారతదేశంలోని ప్రాంతాలు, వివిధ ప్రజల సంస్కృతులు, ఆచార వ్యవహారాలపై ప్రశంసల జల్లు కురిపించారు కొందరు విదేశీయలు. ఇంకొందురు ఓ అడుగు ముందుకేసి మరీ..ఈ దేశంలోనే తమ పిల్లల బాల్యం గడవాలని..ఇక్కడైతేనే విలువలతో పెరుగుతారంటూ భారతదేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ విదేశీయడు భారతీయుల దంత పరిశుభ్రతను మెచ్చుకుంటూ ఓ పోస్టు పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారడమే గాక.. ఇది ఎంత వరకు సబబు అంటూ వివిధ చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్‌లో ఏం పేర్కొన్నాడు..? నెటిజన్లు ఏమంటున్నారు..? అంటే..

జర్మన్‌కి చెందని ఓ ఉద్యోగి తన భారతీయ సహోద్యోగుల దంత పరిశుభ్రతపై చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన పోస్ట్‌లో ఆయన తన భారతీయలు సహోద్యోగులందరి దంతాలు చాలా బాగున్నాయని, వాళ్లందరివి తెల్లగా మెరుస్తూ ఉంటాయని అన్నాడు. పైగా వారి నోటి నుంచి దుర్వాసన అనేది రాదని, వారందరికి చాలా చక్కటి దంత సంరక్షణ అలవాట్లు ఉన్నాయని పేర్కొన్నాడు. 

వాళ్ల దంతాలే అంతలా తెల్లగా ఎలా ఉన్నాయని తెగ ఆలోచించానని అన్నారు. బహుశా వారు తీసుకునే ఆహారంలోని వ్యత్యాసమా లేక దంత పరిశుభ్రతకు సంబధించి సంప్రదాయ అలవాట్ల అందుకు కారణమా అనేది మిస్టరీగా ఉందని రాసుకొచ్చాడు. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని చాలా కుతుహలంగా ఉందని పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

అయితే ఈ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే గాక..కొందరూ అందుకు కారణాన్ని వివరించారు. మరికొందరు తాము ఫేస్‌ చేసిన కొందరు వ్యక్తుల దంత అపరిశుభ్రత గురించి షేర్‌ చేసుకున్నారు. కానీ ఒక నెటిజన్‌ వైద్యుడిగా.. అందుకు గల రీజన్‌ని చాలా వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. రోజుకు రెండు సార్లు బ్రష్‌ చేసుకోవడం తోపాటు..పరగడుపునే బ్రష్‌ చేయకుండా ఏం తీసుకోని భారతీయుల అలవాటే అందుకు కారణమని అన్నారు. 

అలాగే భారతీయులు ఏ ఆహారం తిన్నా..వెంటనే పుక్కిలించడం వంటివి చేస్తారు. అయితే పాశ్చాత్య దేశాల్లో అంతగా పట్టించుకోరు..లైట్‌ తీసుకుంటారు. ముఖ్యంగా పాలు తాగడం, వివిధ మాంసాహారాలు తిన్నప్పుడు కచ్చితంగా దంత సంరక్షణ పాటిస్తారని అన్నారు. అలాగే చాలామంది భారతీయ పేషెంట్లలో దంత అపరిశుభ్రత ఉండటాన్ని గమనించానన్నారు. 

ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పోగాకు, గుట్కా వంటి చెడు అలవాట్ల కారణంగా దంతాలు పసుపు వర్ణంలో ఉండి, దుర్వాసనతో ఉన్న చాలామంది వ్యక్తులకు ట్రీట్‌మెంట్‌ చేశానని అన్నారు. ఏదీఏమైనా..ఈ పోస్ట్‌ వల్ల అనాదిగా మన పెద్దల నుంచి వచ్చిన అలవాట్లే మన భారతీయుల దంత పరిశుభ్రతకు ప్రధాన కారణమనే విషయంల హైలెట్‌ అయ్యింది. 

మనమే చెత్త అలవాట్లతో చేజేతులారా మన ఆరోగ్యాన్ని, దంతాలను పాడు చేసుకుంటున్నామనే విషయం కూడా వెల్లడైంది. కాబట్టి..మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే మంచి అలవాట్లను వినే ప్రయత్నం చేద్దాం.. అందరం ఆరోగ్యంగా ఉందాం.!.

(చదవండి: డిష్‌ వాష్‌బార్‌లతో చేతులు పాడవ్వుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement