పేగులు క్లీన్‌ అవుతాయి | The pubs become clean | Sakshi
Sakshi News home page

పేగులు క్లీన్‌ అవుతాయి

Jun 4 2017 11:11 PM | Updated on Sep 5 2017 12:49 PM

పేగులు క్లీన్‌ అవుతాయి

పేగులు క్లీన్‌ అవుతాయి

క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ.

గుడ్‌ఫుడ్‌

క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. అందుకే పేగులకు ఎంతో మేలు. క్యాబేజీని క్రమం తప్పకుండా తినేవారిలో పేగుల్లో అల్సర్, క్యాన్సర్‌లు నివారితమవుతాయి. మరీ ముఖ్యంగా పెద్ద పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.

మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడానికి క్యాబేజీ చాలా నమ్మకమైన ఆహార పదార్థం.  క్యాబేజీలో విటమిన్‌ సి, విటమిన్‌ కె, ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్‌ ఏ, థయామిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్‌... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా దీన్ని పేర్కొంటారు.క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్‌ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.ఇది ఇచ్చే శక్తి చాలా తక్కువ. వందగ్రాముల క్యాబేజీ నుంచి కేవలం 15 క్యాలరీల శక్తి మాత్రమే లభ్యమవుతుంది.అందుకే స్థూలకాయులకు, బరువు పెరుగుతున్న వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement