మట్టి మంత్రం | The mantra of the soil | Sakshi
Sakshi News home page

మట్టి మంత్రం

Feb 2 2016 12:39 AM | Updated on Sep 3 2017 4:46 PM

మట్టి మంత్రం

మట్టి మంత్రం

మొటిమలతో బాధపడే వారు మెత్తని ఎర్ర మట్టిలో కాస్త పెరుగు కానీ తేనె కానీ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

బ్యూటిప్స్

మొటిమలతో బాధపడే వారు మెత్తని ఎర్ర మట్టిలో కాస్త పెరుగు కానీ తేనె కానీ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకొని, అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో మర్దన చేసుకుంటూ కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమల నుంచి సత్వర ఉపశమనం పొందుతారు.

చుండ్రు సమస్య ఉన్న వారు వారానికోసారి ఎర్రమట్టి ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెత్తని ఎర్రమట్టిలో కాస్త బాదం నూనె లేదా నిమ్మ రసం కలపాలి. అందులో ఒక గుడ్డు తెల్లసొన వేస్తే జుట్టు నిగారిస్తుంది. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement