మోచేతుల నలుపు తగ్గడానికి... | The decline in black elbow ... | Sakshi
Sakshi News home page

మోచేతుల నలుపు తగ్గడానికి...

Dec 18 2015 11:18 PM | Updated on Sep 3 2017 2:12 PM

మోచేతుల నలుపు తగ్గడానికి...

మోచేతుల నలుపు తగ్గడానికి...

భుజాలు, కాళ్లపైన చర్మం నలుపుగా అవుతుంటుంది.

బ్యూటిప్స్

భుజాలు, కాళ్లపైన చర్మం నలుపుగా అవుతుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి...కొబ్బరి నూనె లేదా బాదం నూనె పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి.టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. వెచ్చని నీటిలో టవల్‌ను ముంచి నలుపుగా ఉన్న చోట మృదువుగా రబ్ చేయాలి. టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి తువ్వాలతో తుడవాలి.

నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికి ఒకసారి నలుగుకు నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది.  రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి.   పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి .రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది. రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

 
 

Advertisement
 
Advertisement
Advertisement