నిద్రలేమికి కారణాలు ఆరు! పరిష్కార మార్గాలు పది!! | The causes of insomnia for six! Solutions to ten! | Sakshi
Sakshi News home page

నిద్రలేమికి కారణాలు ఆరు! పరిష్కార మార్గాలు పది!!

Feb 3 2014 11:48 PM | Updated on Sep 2 2017 3:18 AM

నిద్రలేమికి కారణాలు ఆరు! పరిష్కార మార్గాలు పది!!

నిద్రలేమికి కారణాలు ఆరు! పరిష్కార మార్గాలు పది!!

దైనందిన జీవితంలో ఒత్తిడి పెరగడం(పరీక్షలకు చదువుకోవడం, ప్రేమ విఫలం కావడం, నిరుద్యోగం, వైవాహిక జీవితం భగ్నం కావడం వంటి కారణాలు)

మీకు తెలుసా?
 
 కారణాలు
 ఉద్యోగంలో షిఫ్టులు మారడం
 
 నిద్రపోయే ప్రదేశంలో రణగొణ ధ్వనులు
 
 గదిలో ఉష్ణోగ్రతలు దేహానికి సౌకర్యంగా లేకపోవడం
 
 దైనందిన జీవితంలో ఒత్తిడి పెరగడం(పరీక్షలకు చదువుకోవడం, ప్రేమ విఫలం కావడం, నిరుద్యోగం, వైవాహిక జీవితం భగ్నం కావడం వంటి కారణాలు)
 
 మద్యపాన సేవనాన్ని హటాత్తుగా మానేయడం, శరీర కదలికలు లేకుండా రోజు గడపడం, మందుల ప్రభావం
 
 సాయంత్రం ఆరు గంటల తర్వాత కాఫీ, టీ తాగడం
 
 పరిష్కారాలు:  రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి
 
 నిద్రపోని సమయంలో పక్క మీద గడపడాన్ని మానాలి
 
 బెడ్‌రూమ్‌ని నిద్రకే పరిమితం చేయాలి. బెడ్‌రూమ్‌లో చదవడం, టీవీ చూడడం, ఆహారం తినడం వంటి వాటిని నివారించాలి
 
 పడుకోబోయే ముందు వేడినీటితో స్నానం చేసి గోరువెచ్చని పాలు తాగాలి (వేడి వేడి పాలు తాగితే దేహం చైతన్యవంతం అవుతుంది, నిద్రరాదు)
 
 పగటి నిద్రను మానేయాలి. తప్పని సరి అయితే అరగంటకు మించకుండా చిన్న కునుకు తీయవచ్చు. అది కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నిద్రపోకూడదు
 
 రోజుకు కనీసం 20 నిమిషాల వ్యాయామం చేయాలి
 
 కాఫీ, ధూమపానం, ఆల్కహాల్ సేవనాన్ని మానేయాలి లేదా తగ్గించాలి. కాఫీ, టీ లను పరిమితంగా తీసుకునే వారు కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత తీసుకోకూడదు.
 
 నిద్రకు ముందు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు(హెవీ మీల్ తీసుకోకూడదు)
 
 ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతుంటే ఈ విషయాన్ని డాక్టర్‌తో సంప్రదించాలి
 
 నొప్పి వంటి శారీరక సమస్యలు ఉంటే నొప్పి నివారణ మందులు తీసుకోవాలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement