జర్మనీల మధ్య గోడ కూలింది... | That today, October 3, 1990 | Sakshi
Sakshi News home page

జర్మనీల మధ్య గోడ కూలింది...

Oct 3 2015 12:33 AM | Updated on Sep 3 2017 10:21 AM

జర్మనీల మధ్య గోడ కూలింది...

జర్మనీల మధ్య గోడ కూలింది...

బెర్లిన్ గోడ కూలింది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒకటయ్యాయి. దాంతో 45 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న రెండు జర్మనీలు

ఆ  నేడు 1990 అక్టోబర్ 3
బెర్లిన్ గోడ కూలింది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒకటయ్యాయి. దాంతో 45 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న రెండు జర్మనీలు కలసిపోయి ఐక్యజర్మనీ పునరావిర్భవించినట్లయింది. నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, సోవియట్ నాయకుడు మిహాయిల్ గోర్బచెవ్‌ల చొరవతో ఈ పరిణామం సంభవించింది.

తూర్పు, పశ్చిమ జర్మనీలకు రాజధానులుగా ఉన్న బెర్లిన్, బాన్‌లు తిరిగి స్వతంత్ర నగరాలయ్యాయి. రెండు జర్మనీలకు మధ్య అడ్డుగా ఎంతో పటిష్టంగా నిర్మించి ఉన్న బెర్లిన్ గోడను కూలగొట్టడానికి కొన్ని నెలలు పట్టిందంటే అతిశయోక్తి కాదు! మొత్తం మీద దీనినొక ప్రజాస్వామిక విజయంగా వర్ణించవచ్చు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement