చిక్కుడుకాయ తీపికూర | Sweet bean curry | Sakshi
Sakshi News home page

చిక్కుడుకాయ తీపికూర

Jan 31 2017 11:17 PM | Updated on Sep 5 2017 2:34 AM

చిక్కుడుకాయ తీపికూర

చిక్కుడుకాయ తీపికూర

చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి ∙

క్విక్‌ఫుడ్‌

కావలసినవి: చిక్కుడుకాయలు – అర కిలో;శనగపప్పు – టేబుల్‌ స్పూను;మినప్పప్పు – టేబుల్‌ స్పూను;ఆవాలు – టీ స్పూను;జీలకర్ర – టీ స్పూను;ఎండుమిర్చి – 8;చింతపండుగుజ్జు – టేబుల్‌ స్పూను;బెల్లం తురుము – 2 టేబుల్‌ స్పూన్లు;బియ్యప్పిండి – టేబుల్‌ స్పూను;పసుపు – చిటికెడు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు;ఉప్పు – తగినంత;కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా

తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి.బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి. చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి
కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement