తీ ఇన్‌ వన్‌  స్మార్ట్‌ విండో!

This Smart windows developed - Sakshi

మీ ఇంట్లోని కిటికీలు ఒకేసారి మూడు పనులు చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వీరు అభివృద్ధి చేసిన స్మార్ట్‌ కిటికీలు ఒకవైపు ఎండను, ఇంకోవైపు వేడిని నియంత్రిస్తూనే మరోవైపు హానికారక సూక్ష్మజీవులను చంపేయగలవు. విమానాలు మొదలుకొని ఆసుపత్రులు, బస్సులు, రైళ్లలో ఈ కిటికీలను వాడితే బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించగలమనీ, అదే సమయంలో ఎండ, వేడిని నియంత్రించడం ద్వారా బోలెడంత డబ్బును కూడా ఆదా చేయగలమని అంటున్నారు షియా అనే శాస్త్రవేత్త.

టంగ్‌స్టన్‌ ట్రయాక్సైడ్‌ అనే ప్రత్యేక పదార్థం వాడటం ద్వారా ఇది సాధ్యమవుతోందని, విద్యుత్తు ఛార్జ్‌ లేదా రసాయనాల ద్వారా ఈ పదార్థం తక్కువ సమయంలో కాంతిని ప్రసారం చే యడం లేదా అడ్డుకునే స్థితికి మారగలదని చెప్పారు. అదే సమయంలో సూర్యరశ్మిలోని పరారుణ కాంతికిరణాలను వేడిగా మార్చడం ద్వారా భవనం లోపలి భాగపు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చునని వివరించారు. టంగ్‌స్టన్‌ ట్రయాక్సైడ్‌కు నానోస్థాయి బంగారు కణాలను చేర్చడం ద్వారా వేడిని గ్రహించవచ్చునని చెప్పారు. ఈ వేడి వల్ల కిటికీ ఉపరితలంపై ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్‌లు జీవించలేవని అన్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top