ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయా?

వృత్తి ఉద్యోగాల్లో శ్రమదమాదులకోర్చి పురోగతి సాధించినంత మాత్రాన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని అనుకోలేం. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్న వారి పురోగతికి ఓర్వలేని జనం ఉండనే ఉంటారు. ఈర్షా్యపరులైన ప్రత్యర్థుల వల్ల అనుకోని అవరోధాలు తలెత్తడమే కాదు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. ప్రత్యర్థుల వల్ల తలెత్తే సమస్యలను కట్టడి చేయాలంటే...
తెల్లకాగితాల పుస్తకాన్ని, ఎర్రసిరా కలాన్ని తెచ్చుకోండి. ఎర్రసిరా కలంతో పుస్తకంలో శ్రీరాముని కీర్తిస్తూ ‘శ్రీరామ జయం’ అనే మాటను 12,500 సార్లు రాయండి. ఇలా రాయడం పూర్తయిన తర్వాత ఏదైనా ఒక మంగళవారం హనుమాన్‌ ఆలయానికి వెళ్లి, ఆ పుస్తకాన్ని, శనగపిండితో తయారు చేసిన లడ్డూలను సమర్పించండి.
అమ్మవారి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున పదకొండు నేతి దీపాలను వెలిగించండి. ప్రతిరోజూ ఉదయం నిత్యపూజలో భాగంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి.
 ప్రతి మంగళవారం ఉదయం నిత్యపూజ చేసే సమయంలో హనుమాన్‌ చాలీసాను పదకొండుసార్లు పఠించండి. ఆంజనేయ ఆలయాన్ని దర్శించుకుని నేతి దీపాన్ని వెలిగించి, బెల్లం నైవేద్యంగా సమర్పించండి.
ఏదైనా శనివారం గోధుమ రొట్టెలను తయారు చేసి, వాటిపై ఒక పుల్లతో మీ ప్రత్యర్థుల పేరు లేదా పేర్లు రాయండి. ఆ రొట్టెను పెనం మీద కాల్చి, చల్లార్చిన తర్వాత వీధికుక్కకు తినిపించండి.

– పన్యాల జగ న్నాథదాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top