పసుపు గవ్వలు

A story by panyala jagannath das - Sakshi

సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో రకరకాలు ఉంటాయి. వైకుంఠపాళి వంటి ఆటల్లో,  జూదక్రీడల్లో వీటిని ఉపయోగిస్తారనే సంగతి తెలిసినదే. వీటిలో కొంత అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది
 ఇవి లేత పసుపురంగులో కాస్త చిన్నగా ఉంటాయి. పసుపు గవ్వలతో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగుతుంది
 జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు, రాహు కేతు దోషాలు ఉన్నవారు పసుపు గవ్వలను పూజమందిరంలో ఉంచి, వాటికి ధూప దీపాలను సమర్పించడం వల్ల  ఉపశమనం దొరుకుతుంది
 ఎలాంటి పూజల్లోనైనా పసుపు గవ్వలను బేసి సంఖ్యలో ఉపయోగించడమే మంచిది
 పదకొండు పసుపు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి, శుక్రవారం రోజున పూజించి, ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచినట్లయితే ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది.

– పన్యాల జగన్నాథ దాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top