ఒంటరి | Poem | Sakshi
Sakshi News home page

ఒంటరి

Feb 6 2015 11:40 PM | Updated on Sep 2 2017 8:54 PM

ఒంటరి

ఒంటరి

నేనిపుడే వస్తా ఒక మనిషిని కలిసి ఒంటరిననుకుంటున్న ఒక మనిషిని కలిసి పరమ ఏకాకితనంలో మునిగిపోయిన ఒక మనిషిని కలిసి ఇపుడే వస్తా.

కవిత
 
నేనిపుడే వస్తా ఒక మనిషిని కలిసి ఒంటరిననుకుంటున్న ఒక మనిషిని కలిసి  పరమ ఏకాకితనంలో మునిగిపోయిన  ఒక మనిషిని కలిసి ఇపుడే వస్తా.
 
‘కలిసి ఏం చేస్తావ్?’ నువ్వు అడుగుతావు  ఏం చేయను,  అలా చేయి పట్టుకు కూచుంటా-  భుజం మీద చెయ్యేసి హత్తుకుంటా-
 
మాటలు నిరర్థకమైనపుడు స్పర్శ మాట్లాడుతుందనుకుంటా. బహుశా అతనికి తెలియదు  అతనెంత ఒంటరో  నేనూ అంతేనని.
 అంత దూరం పోయి నన్ను నేను కలిసి వస్తానేమో
 - కె.శివారెడ్డి
 
Advertisement
 
Advertisement
Advertisement