దేశభక్తి చేప... | Patriotism fish ... | Sakshi
Sakshi News home page

దేశభక్తి చేప...

Nov 17 2016 11:25 PM | Updated on Sep 4 2017 8:22 PM

దేశభక్తి చేప...

దేశభక్తి చేప...

ఈ చేపకు దేశభక్తి ఉంది. అందుకే తన ఒంటి రంగును తన దేశ పతాకపు రంగులతో మేచ్ చేసింది.

ఈ చేపకు దేశభక్తి ఉంది. అందుకే తన ఒంటి రంగును తన దేశ పతాకపు రంగులతో మేచ్ చేసింది. సరదాగా కనిపిస్తున్నా ఇది నిజం. థాయ్‌లాండ్‌లో సాధారణంగా దొరికే అక్వేరియం చేపల్లో ఒకదానికి అచ్చు ఆ దేశ పతాకానికి ఉన్న రంగులే ఉన్నాయి.

దాంతో దాన్ని కొనుక్కోవడానికి థాయ్‌లాండ్ వాసులు పోటీ పడ్డారు. 600 లేదా వెయ్యి రూపాయలు పలికే ఈ చేప గిరాకీ పెంచుకుంటూ పోయింది. చివరకు బేరం లక్షా ఇరవై వేల రూపాయల దగ్గర తెగింది. థాయ్ చరిత్రలో ఇటువంటి చేప ఇంత రేటు పలకడం ఇదే రికార్డు.

Advertisement
 
Advertisement
Advertisement