గ్రీన్‌కార్డ్ పొందాలంటే... | order to get a green card .... | Sakshi
Sakshi News home page

గ్రీన్‌కార్డ్ పొందాలంటే...

Mar 12 2015 11:27 PM | Updated on Sep 2 2017 10:43 PM

గ్రీన్‌కార్డ్ పొందాలంటే...

గ్రీన్‌కార్డ్ పొందాలంటే...

నేను ఎంబీయే మార్కెటింగ్ చేశాను. తొమ్మిదేళ్లుగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పని చేస్తున్నాను.

నేను ఎంబీయే మార్కెటింగ్ చేశాను. తొమ్మిదేళ్లుగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పని చేస్తున్నాను. అ్క, ఈ కౌఛీఠ్ఛ కూడా చేశాను. అందులో కూడా రెండేళ్ల అనుభవం ఉంది. నాకు అమెరికా బీ1 వీసా ఉంది. 2020 వరకూ వ్యాలిడిటీ కూడా ఉంది. ఇప్పుడు హెచ్1 వీసా కోసం ప్రయత్నిద్దామనుకుంటున్నాను. ఆల్రెడీ బీ1 ఉన్న నేను హెచ్1 పొంద డానికి ఆస్కారం ఉందా? అసలు అప్లై చేయవచ్చా? అసలు హెచ్1 వీసా ఎలా పొందాలి? ఫీజు ఎంత ఉంటుంది?
 - శైలేష్ కుమార్, ముంబై

మీకు బీ1 ఉన్నా కూడా హెచ్1కి అప్లై చేయవచ్చు. అందులో ఏ తప్పూ లేదు. అయితే దీని కోసం స్పాన్సర్ విత్ జాబ్ చాలా ముఖ్యం. అంటే ముందు మీకు ఉద్యోగం రావాలి. తర్వాత మీ ఎంప్లాయర్ మీకు స్పాన్సర్ చేయాలి. అప్పుడు మీరు హెచ్1 కొరకు కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి స్పాన్సర్ దొరికాక ఏం చేయాలో అన్ని వివరాలూ వారే చెప్తారు. ఇక ఫీజు విషయానికొస్తే... మీ స్పాన్సర్‌ని బట్టి ఫీజు ఉంటుంది.
 
నాకు బీ1బీ2  వీసా ఉంది. ఇప్పటి వరకూ ఐదారుసార్లు అమెరికా వెళ్లి వచ్చాను. నాకు అక్కడ గ్రీన్‌కార్డ్ పొందాలన్నా, మా వారిని అమెరికా తీసుకు వెళ్లాలన్నా ఏం చేయాలో చెప్పగలరు?
 - డి.శారద
 
మీరు మీవారిని అమెరికా తీసుకువెళ్లడం, మీరు గ్రీన్ కార్డ్ పొందడం.... రెండూ వేర్వేరు విషయాలు. మీరు గ్రీన్ కార్డ్ పొందాలంటే... మీకు ఎవరైనా స్పాన్సర్ ఉండాలి. ఈ పిల్లలు అమెరికాలో ఉంటే, వాళ్లు అమెరికన్ సిటిజన్స్ అయితే వాళ్లు స్పాన్సర్ చేయవచ్చు. లేదంటే మీరు ఈసారి అమెరికా వెళ్లినప్పుడు ఎవరైనా ఇమిగ్రేషన్ అటార్నీని కలిసి, మీ సమస్యను చర్చించండి. మీ పరిస్థితిని బట్టి వారు ఏం చేయాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్తారు. ఇక మీ వారిని అమెరికా తీసుకెళ్లడం గురించి. మీకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్లు మీ వారికి కూడా చేయవచ్చు. మీ స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు ఎవరైనా ఫరవాలేదు. ఇంకా స్పష్టమైన వివరాలు కావాలంటే... హైదరాబాద్‌లో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌కి ఒక్కసారి వెళ్లండి. లేదంటే వారి వెబ్‌సైట్‌ని అయినా చూడండి. మీకు అన్నీ అర్థమవుతాయి.
 
మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా...
గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్,
 హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement